ఎన్నికల బాండ్ల వివరాలను బహిర్గతం చేయాలి. 

ఎన్నికల బాండ్ల వివరాలను బహిర్గతం చేయాలి. 
  • ఎస్బిఐ చైర్మన్ ను అరెస్టు చేయాలి. 
  • సీపీఎంజిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నెమ్మాది  వెంకటేశ్వర్లు డిమాండ్ 


ముద్ర ప్రతినిధి సూర్యాపేట:-సుప్రీంకోర్టు ఆదేశం మేరకు ఎస్బిఐ చైర్మన్ ను వెంటనే అరెస్టు చేసి,ఎన్నికల బాండ్ల వివరాలను బహిర్గతం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నెమ్మాది  వెంకటేశ్వర్లుకేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం సిపిఎం కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఏపూరు బస్టాండు సమీపంలోని ఎస్బిఐ బ్యాంకు ముందుధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ఎన్నికల వ్యవస్థను రాజ్యాంగ విలువలను దిగజార్చే రితిలో మోడీ ప్రభుత్వం దేశంలోని కార్పోరేట్ సంస్థల యజమానులతో కుమ్ముకై లక్షల కోట్ల ప్రజాధనాన్ని ప్రతి ఏటా కార్పొరేటు సంస్థలకు రుణాలను మాఫీ చేస్తుందన్నారు. ఇందుకు ప్రతిఫలంగా బిజెపి పార్టీ ఈ కార్పొరేటు సంస్థల యజమానుల నుండి ఎన్నికల బాండ్ల రూపంలో ఎస్బిఐ బ్యాంకు ద్వారా బిజెపి దాని మిత్ర పార్టీలు వేలకోట్ల రూపాయలను ఎన్నికల ఫండ్ గాపొందుతున్నారనివిమర్శించారు. దీంతో ఎన్నికల వ్యవస్థను రాజ్యాంగాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఈ విధానం సరియైనది కాదనిఅన్నారు.

సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ, ఇతర మేధావులు సుప్రీంకోర్టును ఇటీవల ఆశ్రయించడంతో ఈ ఎన్నికల బాండ్ల  వ్యవస్థ విధానం సరైంది కాదని దీన్ని రద్దు చేస్తూ ఇప్పటివరకు ఎస్బిఐ ద్వారా ఏ పార్టీకి ఎంత సొమ్ము ముట్టిందని, ఈ సొమ్మును ఎవరెవరు ఇచ్చారనే వివరాలను తక్షణమే బహిర్గతం చేయాలని తీర్పు ఇవ్వడం జరిగిందన్నారు.ఈ సుప్రీంకోర్టు తీర్పును ఎస్బిఐ బ్యాంకు చైర్మన్,బిజెపి పార్టీ మోడీ అనుసరిస్తున్న దానికి తొత్తుగా వ్యవహరిస్తూ ఎన్నికల బాండ్ల వివరాలను బహిర్గతం చేయకుండా కాలయాపన చేస్తున్నాడని ఆరోపించారు. వెంటనే బహిర్గతం చేసే అవకాశం ఉన్న దీనిని తాత్సారం చేస్తున్నాడని ఎస్బిఐ బ్యాంకు చైర్మన్ వ్యవహార శైలి సరైంది కాదన్నారు. ఇది దేశ భద్రతకు, ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. వెంటనే ఎన్నికల బాండ్లను వివరాలను బహిర్గతం చేయని పక్షంలో ఎస్బిఐ చైర్మన్ ను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఎన్నికల బాండ్ల విషయంలో జరుగుతున్న మోసాన్ని దేశంలో ప్రతి ఒక్క ప్రజాస్వామ్య వాది ఈ విధానాన్ని ఖండించాలని పిలుపునిచ్చారు.

ఈ నిరసన కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు, కోట గోపి, డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దండ వెంకటరెడ్డి, జిల్లపల్లి నరసింహారావు, వీరబోయిన రవి, ఎల్గూరి గోవింద్,బెల్లంకొండ వెంకటేశ్వర్లు, చిన్నపంగా నరసయ్య, మేకన బోయిన శేఖర్,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ములకలపల్లి రాములు, సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎం రాంబాబు, గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు ధనియాకుల శ్రీను, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు కొండమడుగుల చిన్న వెంకటేశ్వర్లు, సిఐటియు పట్టణ కన్వీనర్ మామిడి సుందరయ్య, నాయకులు నగర కంటి నరసయ్య, మట్టయ్య, వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.