ఎలక్టోరల్ బాండ్ల వివరాలను వెంటనే బహిరంగపరచాలి

ఎలక్టోరల్ బాండ్ల వివరాలను వెంటనే బహిరంగపరచాలి
  • నల్లధనం మూలాన్ని దాచి పెట్టేందుకు ప్రధాని నరేంద్ర మోడీ, ఎస్బిఐ ప్రయత్నం
  • సామాన్యుల అకౌంట్లో రెండు లక్షలు ఉంటే ఐటీ నోటీసులు ఇచ్చే బ్యాంకులు వేల కోట్లు ఉంటే ఎందుకు ఇవ్వరు
  • ఎఐసిసి ఆధ్వర్యంలో ఎస్బిఐ బ్యాంక్ వద్ద నిర్వహించిన ధర్నాలో ఏఐసిసి సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి

ముద్ర ప్రతినిధి సూర్యాపేట:-కార్పొరేట్ కంపెనీలు రాజకీయ పార్టీలకు ఇచ్చే విరాళల్లో  గోప్యతను పాటించే ఎలక్ట్రోల్ బాండ్ల వివరాల్లో ప్రధాని నరేంద్ర మోడీ వేలకోట్ల దుర్వినియోగానికి పాల్పడి నల్లధనాన్ని దాచిపెట్టేందుకు ఎస్బిఐ ని వాడుకుంటున్నాడని ఏఐసిసి సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి అన్నారు. 

ఎఐసిసి,పిసిసి పిలుపుమేరకు ఎలక్టరోల్ బాండ్ల వివరాలను బహిరంగపరచాలని డిమాండ్ చేస్తూ గురువారం స్థానిక ఎస్బిఐ మెయిన్ బ్రాంచ్ ఎదుట మహా ధర్నా నిర్వహించి మాట్లాడారు. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉండగా సోనియాగాంధీ ఆర్టీఐ చట్టాన్ని తీసుకురావడం జరిగిందన్నారు. ఎలక్ట్రోల్ బాండ్ లకు ప్రాథమిక లబ్ధిదారుగా ఉన్న ఎస్బిఐ ని కార్పొరేట్ సంస్థల విరాళాలను ప్రజలకు చెప్పాలని న్యాయవాది ప్రశాంత్ భూషణ్ సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగిందన్నారు. మార్చి 6 వరకు వివరాలు తెలపాలని ఎస్బిఐని సుప్రీంకోర్టు ఆదేశించగా వివరాలు తెలుపకపోగా మళ్లీ గడువు కోరుతుందన్నారు. ఎలక్ట్రోల్ బాండ్ల ద్వారా వేలకోట్ల విరాళాలు వచ్చాయని, దీనిపై కాంగ్రెస్ మొదటి నుంచి కొట్లాడుతుందన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ జూన్ 30 వరకు ఎస్బిఐ తిరిగి గడువు కోరడం సరికాదన్నారు. 
సామాన్యుడికి రెండు లక్షలు అకౌంట్లో జమ అయితే ఐటీ నోటీసులు ఇచ్చే ఎస్బిఐ వేలకోట్ల అకౌంట్ల వివరాలను ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. మే 30 తర్వాత ఎన్నికలు వస్తాయనీ, మనలను ఎవరు ఏమి చేయలేరని అనుకుంటున్నారని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎస్బిఐ అధికారులపై చర్యలు తప్పవన్నారు. 

వెంటనే ఎలక్ట్రోల్ బాండ్ల సమాచారాన్ని బహిర్గత పరచాలని మోడీ,ఎస్బిఐ దిగివచ్చే వరకు తమ పోరాటం ఆగదనీ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అంజాద్ అలీ, కక్కిరేణి శ్రీనివాస్, పోలగాని బాలు, చంచల శ్రీనివాస్, కొండపల్లి నిఖిల దిలీప్ రెడ్డి, ఎలిమినేటి అభినయ్, జహీర్, గండూరి రాధిక రమేష్, పోలబోయిన నరసయ్య, ఆలేటి మాణిక్యం, నరేందర్ నాయుడు, సాయి నేత, డి ఆర్ తదితరులు పాల్గొన్నారు