అభివృద్ధి, ప్ర‌జా సంక్షేమం ప్ర‌భుత్వానికి రెండు కండ్లు

అభివృద్ధి, ప్ర‌జా సంక్షేమం ప్ర‌భుత్వానికి రెండు కండ్లు
  • దేశంలో ఎక్కడా లేనివిధంగా  తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు
  • ఆత్మ‌గౌర‌వ ప్రతీకకు  కెసిఆర్ సంక్షేమ పథకాలు
  • హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి

హుజూర్ నగర్, ముద్ర:పేదలు ఆత్మ గౌరవంగా బ్రతికెందుకు సీఎం కెసిఆర్  సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టారని హుజూర్నగర్  శాసనసభ్యులు శ్రీ శానంపూడి సైదిరెడ్డి  అన్నారు. సోమవారం హుజూర్ నగర్  ఎమ్మెల్యే  క్యాంపు కార్యాలయంలో మఠంపల్లి  మండలం మట్టపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో  గల నాగార్జున సిమెంట్ ఫ్యాక్టరీ నందు గత 30 ఏళ్ల గా  పనిచేస్తున్న ప్రైవేట్ కార్మికులకు, రిటైర్మెంట్ అయిన మాజీ కార్మికులకుకు అలాగే ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలకు 60 కుటుంబాలకు ఇళ్ల స్థలాలను  హుజూర్ నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి పంపిణీ చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో మఠంపల్లి మండల నాయకులు మన్నెం శ్రీనివాస్ రెడ్డి, గూండా బ్రహ్మారెడ్డి , ఎంపీపీ పార్వతి కొండా నాయక్, మట్టపల్లి  గ్రామ సర్పంచ్ దాసరి విజయలక్ష్మి వెంకటరమణ, ఉప సర్పంచ్ దాట్ల రంగరాజు, గ్రామ శాఖ అధ్యక్షులు కంబాల మురళి, గ్రామపంచాయతీ వార్డ్ మెంబర్స్ దాసరి వెంకటేశు, ఆలేటి నాగలక్ష్మి, కాశయ్య, పరాశరామ్, అయ్యప్ప, అనంతరెడ్డి, ఆలయ ధర్మకర్త లు కంబాల రామయ్య, తోమాటి శ్రీనివాసాచార్యులు, మట్టపల్లి ఎన్సీఎల్ గ్రామ ప్రజలు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.