మంత్రి ఉత్తమ్ సహకారంతో గ్రామ ప్రజల రుణం తీర్చుకున్నా 

మంత్రి ఉత్తమ్ సహకారంతో గ్రామ ప్రజల రుణం తీర్చుకున్నా 
  • రూ 2 కోట్లతో బెట్టే తండా అభివృద్ధి 
  • సర్పంచ్ మోతిలాల్ 

పాలకీడు, ముద్ర:- పాలకవీడు మండలం బెట్టే తండా గిరిజన గ్రామాన్ని  రూ. 2 కోట్ల తో అభివృద్ధి పరచి గ్రామ ప్రజల రుణం తీర్చుకున్నానని ఆ గ్రామ  సర్పంచ్ మాలోతు మోతిలాల్ నాయక్ అన్నారు. గురువారం  గ్రామ పంచాయతీ కార్యాలయంలో పదవీకాలం ముగుస్తున్న సందర్భంగా సర్పంచ్ మోతిలాల్ తో పాటు వార్డు సభ్యులను గ్రామ ప్రజలు సన్మానించిన సందర్భంగా మాట్లాడారు.  కాంగ్రెస్ పార్టీ నుండి  సర్పంచ్ గా ఎన్నికయ్యానన్నారు. అప్పటి బిఆర్ఎస్ ప్రభుత్వం స్థానిక సంస్థలకు నిధులివ్వకుండా నిర్లక్ష్యం వహించిందన్నారు. అయినప్పటికీ ప్రస్తుతం జిల్లా మంత్రిగా ఉన్న కెప్టెన్ నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్లగొండ పార్లమెంటు సభ్యులుగా పనిచేస్తున్న సమయంలో అందించిన తోడ్పాటుతో అభివృద్ధి సాధ్యపడిందన్నారు.

గ్రామంలో 98శాతం సిసి రోడ్లు మురుగు కాలువలు నిర్మించానన్నారు. బెట్టేతండా  లిఫ్ట్ నిర్మాణం కొరకు రూ.38 కోట్లు మంజూరుకి కృషి చేశానన్నారు. ప్రభుత్వ పథకాలు ప్రతి గడపకు చేర్చానన్నారు. మంత్రి ఉత్తమ్  సహకారంతో మంజూరైన   నిధులతో గ్రామాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దామని  మంత్రి ఉత్తమ్ కు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ప్రతి అభివృద్ధి పనికి సహకరించిన వార్డు సభ్యుల, గ్రామస్తుల సహకారం మరువలేనిదన్నారు. కార్యక్రమంలో  ఎంపీటీసీ బి.రామారావు, ఉప సర్పంచ్ లావుడ్యా శారద, గ్రామ కార్యదర్శి లక్ష్మీపార్వతి, వార్డు సభ్యులు బద్దు, సుధీర్ ,రవి, శారద, లక్ష్మీ, అరుణ, బాలాజీ, బుజ్జి, కిషన్, కృష్ణ, భారతి, సైదా, భరత్, శ్రీను, మంగ్య, హరి,బంగి, రమేష్, సైదులు, సందీప్, శివాజీ,హరి, సుధీర్ తదితరులున్నారు.