బాసర గోదావరి లో మునిగి భక్తుడి మృతి

బాసర గోదావరి లో మునిగి భక్తుడి మృతి

బాసర, ముద్ర:-నిర్మల్ జిల్లా బాసర సరస్వతి అమ్మవారి దర్శనానికి వచ్చిన ఓ భక్తుడు గోదావరి నదిలో స్నానానికి వెళ్లి మునిగి చనిపోయాడు. వివరాల్లోకి వెళ్తే అమ్మవారి దర్శనానికి వచ్చిన మేడ్చల్ జిల్లా గజ్జుల తండా కు చెందిన వరుసకు బావ బామ్మర్ధులు అయిన శ్రీనివాస్, మృతుడు నాగరాజు గోదావరి లోకి స్నానానికి వెళ్ళారు.మొదట గుండు గీయించుకున్న మృతుడు నాగరాజు (35) గోదావరి లో స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు మునిగి చనిపోయాడు. అక్కడే ఉన్న మృతుడు బావ శ్రీనివాస్ కాపాడండి అంటూ ఆర్తనాదాలు చేసిన ఎవరు పట్టించుకోలేదని, కనీసం  గజ ఈతగాళ్లు ఉంటే నైనా తన బామ్మర్ది  బతికి ఉండే వాడని వాపోయాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.