లక్ష్మీ నరసింహ స్వామి జాతరకు పోటెత్తిన భక్తజనం

లక్ష్మీ నరసింహ స్వామి జాతరకు పోటెత్తిన భక్తజనం

గోవింద నామస్మరణతో మార్మోగిన కొడవటంచ
పెద్ద రథం పై ఊరేగిన లక్ష్మీనరసింహుడు
ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే గండ్ర దంపతులు
ముద్ర న్యూస్ :రేగొండ గోవింద నామస్మరణతో కోటంచ ఆలయ ప్రాంగణం మారుమోగిపోయింది. లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల భాగంగా మంగళవారం ప్రధాన ఘట్టమైన మహా జాతర ప్రారంభమైంది. ఉదయం ఐదు గంటలకు స్వామివారికి బోనాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. హోమ బలిహరణ మహా పూర్ణహోతి నిర్వహించారు. సాయంత్రం బోనాలు తిరగడంతో జాతర సాంప్రదాయ బద్దంగా పూజారులు ప్రారంభించారు. భక్తుల కోలహాల మధ్య సాయంత్రం 6 గంటలకు స్వామివారి నీ పెద్ద రథంపై ఊరేగించారు. వివిధ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున భక్తులు ప్రభుత్వ బండ్లు ఏనుగ వాహనాలు తరలివచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. జాతరలో వివిధ గ్రామాల నుండి తరలివచ్చిన ప్రభ బాలు ప్రత్యేక ఆకర్షణీయంగా నిలిచాయి. 

ఎమ్మెల్యే దంపతుల ప్రత్యేక పూజలు
భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, వరంగల్ రూరల్ జిల్లా జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్దరతంపై ఊరేగింపులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాండ్రా వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి కోటి రూపాయలతో ప్రాకార మండపం నిర్మిస్తున్నామని 65 లక్షలతో కళ్యాణ మండపం నిర్మాణానికి పనులు ప్రారంభించామని, త్వరలో మరిన్ని నిధులు కేటాయించి కోటాంచ అలా అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ మాదాడి అనిత కరుణాకర్ రెడ్డి, స్థానిక సర్పంచ్ పబ్బ శ్రీనివాస్ గౌడ్, ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షులు ఎర్రబెల్లి రవీందర్ రావు, ఈవో బిల్లా శ్రీనివాస్, ఎంపీపీ పున్నము లక్ష్మి రవి, జడ్పిటిసి సాయిని విజయ, బిఆర్ఎస్  మండల అధ్యక్షులు అంకం రాజేందర్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు ఆలయ ధర్మకర్తలు పాల్గొన్నారు.