ప్రజలకు ఎం చేశారని బిజెపి నాయకులు ఓట్లు అడుగుతున్నారు..

ప్రజలకు ఎం చేశారని బిజెపి నాయకులు ఓట్లు అడుగుతున్నారు..
  • చక్కర కర్మాగారం తెరిపించారా..కాగితాల్లోనే పసుపు బోర్డు ఏర్పాటు..
  • జీవన్ రెడ్డి పై అవాకులు..చవాకులు మానుకోవాలని బిజెపి నాయకులకు హితవు..
  • విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లురి లక్ష్మణ్ కుమార్

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: అరవింద్ ఐదేళ్ల లో చేసిన అభివ్రుది చూపి ఓట్లు అడుగకుండ.. కాగితాల్లోనే పసుపు బోర్డు  చూపెడుతూ ఓట్లు అడుగడం చేతగానితనానికి నిదర్శనమని విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లురి లక్ష్మణ్ కుమార్  అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో జగ్జీవన్ రావు జయంతి సందర్భంగా అయన చిత్రపటానికి పులామాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం విలేకరుల సమావేశంలో లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ  తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లో జగ్జీవాన్ రాం కూతురు మీరా కుమారి కీలక పాత్ర పోషించారనీ గుర్తు చేశారు. బిజెపి రైతులకు ఎం చేసింది.. షుగర్ ఫ్యాక్టరీ ఎందుకు పునః ప్రారంభించలేదని ప్రశ్నించారు. ఢిల్లీ సరిహద్దుల్లో నల్ల చట్ల ఉపసంహరించాలని రైతులు ధర్నా చేస్తే మోడీ 750 మంది రైతులను పొట్టన బెట్టుకున్నారనీ విమర్శించారు.ఒక వర్గానికి ప్రాతినిద్యం వహించినట్లుగా బిజెపి నాయకుల వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

జగిత్యాల రామాలయం నిర్మాణం, హనుమాన్ అలయా ల అభివ్రుది కృషి చేసింది జీవన్ రెడ్డి అని మరిచిపోవద్దని అన్నారు. మాజీ సీఎం కెసిఆర్ పంట పొలాలు నష్ట పోయిన వారికి 10వేలు పరిహారం ఇస్తామని చెప్పి ఒక్కరికైన ఇచ్చారా అని ప్రశ్నించారు. ధాన్యం తూకంలో క్వింటాల్ కు పది  కిలోలు కట్ చేస్తే కొప్పుల ఈశ్వర్ ఎం చేశారని నిలదీశారు.అన్ని వర్గాల ప్రజలకు, రైతులకు అండగా నిలిచేది జీవన్ రెడ్డీ మాత్రమే అని పేర్కొన్నారు. మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ జిల్లా మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు తాటిపర్తి విజయలక్ష్మి దేవందర్ రెడ్డి మాట్లాడుతూ శ్రావణి ఛైర్పర్సన్ గా ఉన్నప్పుడు రెండు సార్లు ఏసీబీ దాడులు జరిగిన విషయం  మరిచిపోవద్దని, కాంగ్రెస్ పాలనలో పీఎఫ్ఐ నీ పెంచి పోషించారని వ్యాఖ్యలను నిరుపించకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అన్నారు.  శ్రావణి తన స్థాయినీ గుర్తెరిగి మాట్లాడాలని, జీవన్ రెడ్డి నీ విమర్శించే స్థాయి లేదని ..మరోమారు విమర్శిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల మున్సిపల్ మాజీ చైర్మన్ గిరి నాగభూషణం, కళ్లే పల్లి దుర్గయ్య, బండ శంకర్, గాజుల రాజేందర్, మాంకాలి రాజన్న, చాంద్ పాషా, బొల్లి శేఖర్, కొత్త మోహన్, గుంటీ జగదీశ్వర్, గుండా మధు పాల్గొన్నారు.