ఇథనాల్ ఫ్యాక్టరీ కి వ్యతిరేకంగా ధర్నా,రాస్తారోకో

ఇథనాల్ ఫ్యాక్టరీ కి వ్యతిరేకంగా ధర్నా,రాస్తారోకో

ముద్ర ప్రతినిధి, నిర్మల్:నిర్మల్ నియోజకవర్గం దిలావర్ పూర్, గుండంపల్లి గ్రామాల మధ్య ఏర్పాటు చేస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీ పనులను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా, రాస్తారోకో నిర్వహించారు.దిలావర్పూర్ లో 62వ జాతీయ రహదారిపై దాదాపు అరగంటకు పైగా జరిగిన ఈ నిరసనతో రోడ్డుకిరువైపులా వందలాది వాహనాలు నిలిచిపోయాయి. పరిసర ప్రాంతాల ప్రజల ఆరోగ్యానికి, పర్యావరణానికి ప్రమాదకరం గా మారనున్న ఈ ఫ్యాక్టరీ ఏర్పాటును విరమించుకోని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని రైతులు స్పష్టం చేశారు. కలెక్టర్ వచ్చి స్పష్టమైన హామీ ఇచ్చే వరకు కదలమని భీష్మించారు. ఒక దశలో పోలీసులకు, నిరసనకారులకు మధ్య వాగ్వాదం జరిగింది. చివరకు పోలీసుల జోక్యంతో నిరసన విరమించారు.