సీఎం రిలీఫ్ చెక్కుల పంపిణీ

సీఎం రిలీఫ్ చెక్కుల పంపిణీ

కాటారం, ముద్ర న్యూస్: మండలంలోని లబ్దిదారులకు సీఎం రిలీఫ్ చెక్కులను ఎంపీపీ పంథకాని సమ్మయ్య మంగళవారం అందజేశారు. విలాసాగర్ గ్రామానికి చెందిన పప్పుల బాలరాజు 15,500,ప్రతాపగిరికి చెందిన జక్కుల ఫోసక్కకు 42,000, గంగారం పప్పుల రవితేజ కు 35,000, దామెరకుంట గ్రామానికి చెందిన అనపర్తి రామయ్య కు 15,000, ల చొప్పున సీఎం సహాయ నిధి నుంచి మంజూరు అయ్యాయని సమ్మయ్య తెలిపారు.

పేద కుటుంబాలకు చెందిన వీరి విజ్ఞప్తి మేరకు మాజీమంత్రి, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ఈ నిధుల మంజూరుకు కృషి చేశారని ఎంపిపీ పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో ఎంపీటీసీ మహేష్ రవిందర్ రావు, నాయకులు చీర్ల తిరుపతి రెడ్డి, కొమురయ్య, సారయ్య లు పాల్గొన్నారు.