ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పుస్తకాల పంపిణీ

ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పుస్తకాల పంపిణీ

ముద్ర ప్రతినిధి, నల్గొండ: కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఉమెన్స్ డిగ్రీ కళాశాల లైబ్రరీకి, జిల్లా కేంద్ర గ్రంథాలయాలకు జనరల్ నాలెడ్జ్, గ్రూప్-, గ్రూప్-2 ప్రిపరేషన్ పుస్తకాలను మంగళవారం ఆ ఫౌండేషన్ సీఈవో ఎం.వి గోనా రెడ్డి అందజేశారు.

ఈ సందర్భంగా కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ విద్యార్థులకు పేదలకు అండగా నిలుస్తూ అనేక సేవా కార్యక్రమాలు చేపడుతుందన్నారు. దానిలో భాగంగానే విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా జనరల్ నాలెడ్జ్ పుస్తకాలను పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నల్గొండ పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, జడ్పిటిసి వంగూరు లక్ష్మయ్య, నాయకులు మధుసూదన్ రెడ్డి, గ్రంథాలయ సీనియర్ అసిస్టెంట్ నర్సిరెడ్డి, డిగ్రీ ఉమెన్స్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ గన్ శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.