మానవత్వం చాటుకున్న ప్రైవేటు సంస్థ...
తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని వెలిమెల ప్రభుత్వ తెలంగాణ మోడల్ పాఠశాలకు మంగళవారం ఓ ప్రైవేట్ సంస్థ సిఎస్ఆర్ నిధులు కింద 20 కంప్యూటర్లను అందించారు. ఆ సంస్థ ప్రతినిధులు, తెల్లాపూర్ నైబర్హుడ్ అసోసియేషన్ అధ్యక్షులు ఈశ్వర్ గారు రమణ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఈశ్వర్ గారు రమణ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలకు సహకారాలు అందించాలని సంస్థను కోరడంతో వారు ముందుకు వచ్చి 70 కంప్యూటర్లను దశలవారీగా ఇచ్చేందుకు అంగీకరించడం జరిగిందన్నారు. ముందస్తుగా ప్రభుత్వ తెలంగాణ మోడల్ పాఠశాలకు 20 కంప్యూటర్లను అందించినందుకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.