ఆసరా పెంపుతో దివ్యాంగులకు మరింత ఆత్మస్థైర్యం

ఆసరా పెంపుతో దివ్యాంగులకు మరింత ఆత్మస్థైర్యం
  • ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి
  • దివ్యాంగులకు నెలకు రూ.4016 అందించిన ఘనత సీఎం కేసిఆర్ దే
  • దివ్యాంగులకు పెంచిన నూతన పింఛన్ల పంపిణీ

ఇబ్రహీంపట్నం, ముద్ర: దివ్యాంగుల అసరా పింఛన్ల పెంపుతో వారి జీవితాల్లో మరింత ఆత్మస్థైర్యం పెల్పొందుతుందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఇబ్రహీంపట్నం మున్సిపల్ కేంద్రంలోని భారత్ గార్డెన్ లో నియోజకవర్గంలోని నాలుగు మండలాలు, నాలుగు మున్సిపాలిటీలకు చెందిన దివ్యాంగులకు ప్రభుత్వం పెంచిన రూ.4016 ఫించన్ మంజూరు పత్రాలను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కిషన్ రెడ్డి మాట్లాడుతూ... ముఖ్యమంత్రి కేసీఆర్ సారధ్యంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు. సీఎం కేసిఆర్ నేతృత్వంలో మంత్రి కేటీఆర్ ఆలోచనలతో తెలంగాణ రాష్ట్రం బ్రహ్మాండంగా అభివృద్ధి సాధిస్తుందని అన్నారు. పెన్షన్ రూ. 4016 లకు పెంచి దివ్యాంగులలో మరింత భరోసా నింపిందన్నారు.

ఆసరా పెంపుతో దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రజా సంక్షేమ పథకాలు మన రాష్ట్రంలోనే అమలవుతుండడంతో దేశానికే తెలంగాణ దిక్సూచిగా మారిందని అన్నారు. దివ్యాంగుల సంక్షేమమే ప్రభుత్వం యొక్క లక్ష్యం అని అన్నారు. గత ప్రభుత్వాలు అందించిన చాలీచాలని ఫించన్లతో ప్రజలను గోస పెట్టాయని, కానీ కేసిఆర్ వారికి కడుపునిండా పథకాలు ఇచ్చి అండగా నిలబడుతున్నారని స్పష్టం చేశారు. మానవీయకోణంలో కేసిఆర్ జనరంజక పాలన కొనసాగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, ఎంపీపీలు కృపేశ్, నర్మదా, మార్కెట్ కమిటీ చైర్మన్ ఏర్పుల చంద్రయ్య, మున్సిపల్ చైర్ పర్సన్ కప్పరి స్రవంతి, వైస్ చైర్మన్ ఆకుల యాదగిరి, ఎంపీడీఓలు విజయలక్ష్మి, శ్రీనివాస్, మమతభాయి, వెంకటమ్మ, అధికారులు, దివ్యాంగులు పాల్గొన్నారు.