గల్ఫ్ బాధితుని కోసం చర్యలు

గల్ఫ్ బాధితుని కోసం చర్యలు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లాకు చెందిన గల్ఫ్ బాధితుని రక్షించేందుకు చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వెల్లడించారు. కువైట్ దేశంలోని ఎడారిలో ఒంటెలు కాస్తున్న ముధోల్ మండలం రువ్వి గ్రామానికి చెందిన నాందేవ్ గత కొన్ని రోజులుగా ఎడారిలో కఠిన పరిస్థితుల మధ్య ఇబ్బందులు పడుతున్నారు.

ఈ అంశాన్ని సామాజిక మాధ్యమాల్లో వీడియోగా పోస్ట్ చేశాడు. దీనిపై స్పందించిన జిల్లా యంత్రాంగం రియాద్, కువైట్ రాయబార కార్యాలయాన్ని సంప్రదించింది. ప్రస్తుతం అతను క్షేమంగా ఉన్నాడని, అతనిని తిరిగి రప్పించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వెల్లడించారు.