జిల్లాలో   విద్యా, వైద్యం, ప్రజా సమస్యల పై మొదటి ప్రాధాన్యత – జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

జిల్లాలో   విద్యా, వైద్యం, ప్రజా సమస్యల పై మొదటి ప్రాధాన్యత  – జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

ముద్ర.వనపర్తి:-జిల్లాలో ప్రజల సమస్యల పరిష్కారంతో పాటు విద్యా, వైద్యం పై ప్రాధాన్యత ఉంటుందని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు.2018 బ్యాచ్ ఐ.ఏ.ఎస్ అయిన ఆదర్శ్ సురభి ఆదివారం వనపర్తి జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ గా బాధ్యతలను స్వీకరించారు.అంతకుముందు అదనపు కలెక్టర్ రెవెన్యూ యం.నగేష్ కొత్తగా నియమితులైన జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ను ఐ.డి. ఒ .సి. ప్రాంగణంలో పూల మొక్కతో సాదర ఆహ్వానం పలికారు.వనపర్తి జిల్లా కలెక్టర్ గా  సి.టి.సి పై సంతకాలు చేసి బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ జిల్లాలో ప్రజల సమస్యలకు పరిష్కారం చూపడం తో పాటు విద్యా పరంగా అభివృద్ధి చేసేందుకు, ప్రజలకు నాణ్యమైన వైద్యం అందేవిధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

వనపర్తి జిల్లాకు కలెక్టర్ గా నియమితులై బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ ను  రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా. జిల్లేల చిన్నా రెడ్డి పూల బొకే ఇచ్చి శాలువాతో సన్మానం చేస్తూ తన శుభాకాంక్షలు తెలిపారు.  జిల్లా అభివృద్ధికి  సమన్వయంతో కలిసి  కృషి చేద్దామని పేర్కొన్నారు. తనవంతు పూర్తి సహకారం అందిస్తానని ప్రణాళిక సంఘం అధ్యక్షులు తెలియజేశారు. అనంతరం జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది కలెక్టర్ కు మొక్కలు ఇచ్చి స్వాగతం పలికారు. డి.పి ఆర్.ఒ సీతారాం,  మార్కెటింగ్ అధికారి స్వరణ్ సింగ్, డి. ఈ. ఒ గోవిందరాజులు, యూత్ అండ్ స్ట్పోట్స్ అధికారి సుధీర్ రెడ్డి, సి.పి. ఒ. చంద్రశేఖర్ రాజు, సి.సెక్షన్ సూపరింటెండెంట్ రమేష్ రెడ్డి, డి.టి. మధు  తదితరులు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.