పిహెచ్ సి ను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ -జూనియర్ అసిస్టెంట్ సస్పెండ్
ముద్ర ప్రతినిధి, కామారెడ్డి:జిల్లా కలెక్టర్ అశ్విన్ సాంఘ్వన్ గురువారం నాడు నిజాంసాగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో హాజరు పట్టిక ను చూసి గతనెల 27 నుండి నేటి వరకు విధులకు హాజరు కాని జూనియర్ అసిస్టెంట్ సుభాష్ ను సస్పెన్షన్ కు ఆదేశించారు. రెగ్యులర్ గా విధులకు హాజరు కాని ల్యాబ్ టెక్నీషియన్ నవ్యశ్రీ ని సంజాయిషీ కోరారు. ఆస్పత్రిలోని ఇన్ పేషెంట్ వార్డును పరిశీలించి రోగులతో మాట్లాడి ఆసుపత్రి లో అందుతున్న రోగుల సేవల పై సంతృప్తి వ్యక్తం చేశారు. అందుబాటులో ఉన్న మందుల వివరాల గురించి వైద్యాధికారి రోహిత్ కుమార్ ను అడగారు. ఆసుపత్రి లో నాటిన హరిత హారం చెట్లను పరిశీలించారు. మెడికల్ వేస్ట్ ను ఎక్కడ పడితే అక్కడ పారవేయకుండా గుంతలలో వేయాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమములో బాన్సువాడ ఆర్డిఓ రమేష్ రాథోడ్, జిల్లా వైద్యాధికారి చంద్ర శేఖర్, ఉప వైద్యాధికారి విద్య, మండల అభివృద్ధి అధికారి, మండల తహసీల్దార్ ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం నిజాంసాగర్ ప్రాజెక్టును పరిశీలించారు. నీటిమట్టం, ప్రాజెక్టు పరిస్థితి ని అడిగి తెలుసుకున్నారు.