వ్యవసాయంలో సాంకేతికతను జోడించి తక్కువ ఖర్చుతో సాగు చేయాలి - జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు

వ్యవసాయంలో సాంకేతికతను జోడించి తక్కువ ఖర్చుతో సాగు చేయాలి - జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు

ముద్ర ప్రతినిధి సూర్యాపేట:-రైతులు సాగులో సాంకేతిక జోడించి తక్కువ ఖర్చుతో వ్యవసాయం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ యస్. వెంకటరావు సూచించారు. అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్టక్చర్ ఫండ్  పధకం కింద జాజిరెడ్డి గూడెం ఎస్బిఐ బ్యాంక్  జిల్లాలో మొట్టమొదటిసారి అర్వపల్లి మండలం కొమ్మాల కు చెందిన కుంటి గోర్ల నాగరాజు రైతు కొనుగోలు చేసిన అగ్రి డ్రోన్ ను జిల్లా కలెక్టర్ యస్. వెంకటరావు ఎల్ డి ఎం తో కలిసి మంగళవారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  వ్యవసాయంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించడానికి, మెరుగైన సామర్థ్యం కోసం, పంట దిగుబడిని పెంపొందించడానికి, రైతులకు ప్రయోజనం చేకూర్చే ఖర్చును తగ్గించడంలో అగ్రి డ్రోన్ సహాయపడుతుందని తెలిపారు. వ్యవసాయానికి మరింత టెక్నాలజీని జోడించేందుకు ప్రయత్నాలు చేయడం అభినందనీయమని అన్నారు. రైతులకు మరింత సులభమయ్యే పద్ధతులను అందుబాటులోకి తీసుకురావాలని, దీనికోసం మందుల పిచికారి లో డ్రోన్ల వినియోగాన్ని అందుబాటులో తేవడంతో ఖర్చును ఆదా చేయడంతో పాటు  మెరుగైన ఉత్పత్తిని పొందడంలో రైతులకు సహాయపడుతుందన్నారు . ఈ కార్యక్రమంలో ఎల్డీఎం బాపూజీ, ఎస్బిఐ రీజినల్ మేనేజర్ కే జ్యోతి, వై నరసింహారావు,బ్యాంక్ మేనేజర్ వి అనిల్, రైతు నాగరాజు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.