పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి

పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి
  • ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్న కాంగ్రెస్ పార్టీ
  • కాంగ్రెస్ పాలనలోనే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి
  • జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్

తుంగతుర్తి ముద్ర:- పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా తుంగతుర్తి మండల కేంద్రంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్ ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీలో ఉన్న తీన్మార్ మల్లన్న కు ఓటు వేసి గెలిపించాలని పట్టభద్రులను కోరారు .కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చే క్రమంలో పేద ప్రజానీకానికి మేలు చేకూరుతుందని అన్నారు. అందులో భాగంగానే పేద ప్రజానీకం అనునిత్యం ప్రయాణించే ఆర్టీసీలో మహిళలకు ఉచిత రవాణా కల్పించిందని కొండెక్కిన గ్యాస్ ధరను 500 కి పేద గృహల గృహిణులకుఅందిస్తుందని అన్నారు. ఆరు గ్యారెంటీలలో ఇప్పటికే ఐదు గ్యారంటీలు అమలయ్యాయని ఆగస్టు 15 లోపు రైతన్నలకు రెండు లక్షల రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. పేదలకు ఇందిరమ్మ ఇల్లు త్వరలోనే ఇవ్వడం జరుగుతుందని అన్నారు.

నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పన కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తుందని అన్నారు. గత పాలనలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కొద్ది నెలల్లోనే అభివృద్ధి జరుగుతుందని అన్నారు .నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టబద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మల్లనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పట్టబద్రులను కోరారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్ తుంగతుర్తి పట్టణంలో ఉద్యోగాలు రాక పలు ప్రైవేట్ వ్యాపారాలు చేస్తున్న పట్టభద్రులను కలిసి తీన్మార్ మల్లన్న ఓటు వేయాలని అభ్యర్థించారు. డిసిసి అధ్యక్షుని వెంట మండల పార్టీ అధ్యక్షుడు దొంగర గోవర్ధన్, తుంగతుర్తి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉప్పుల రాంబాబు , సత్యనారాయణ కాంగ్రెస్ నాయకులు ముత్యాల వెంకన్న గంగరాజు యాదవ్ కటకం ఉప్పలయ్య అక్కినపల్లి రాములు. జలంధర్ ,రాములు లతోపాటు పలువురు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.