మద్యం దుకాణాల తనిఖీ నిర్వహించిన జిల్లా ఎక్సైజ్ అధికారి

మద్యం దుకాణాల తనిఖీ నిర్వహించిన జిల్లా ఎక్సైజ్ అధికారి

ముద్ర ప్రతినిధి,చొప్పదండి: మద్యం దుకాణాల గడువు ఈనెల చివరితో ముగుస్తుండడంతో మండలంలోని పలు మద్యం దుకాణాలను జిల్లా ఎక్సైజ్ అధికారి శ్రీనివాసరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. దుకాణాల్లో ఉన్న స్టాకు వివరాలను,రిజిస్టర్లను క్షుణ్ణంగా పరిశీలించారు. దుకాణాల్లో అమ్మిన స్టాక్ వివరాలను ఎప్పటికప్పుడు రిజిస్టర్లలో నమోదు చేసి ఉంచాలని ఆదేశించారు.