పోలీస్‌ కొలువు సాధించినందుకు గర్వపడాలి: జిల్లా ఎస్పీ చందనా దీప్తి

పోలీస్‌ కొలువు సాధించినందుకు గర్వపడాలి: జిల్లా ఎస్పీ చందనా దీప్తి
  • పోలీస్ శాఖకు మంచి పేరు ప్రతిష్టలు తేవాలి 
  • ట్రైనీ కానిస్టేబుళ్ల శిక్షణా కార్యాక్రమాన్ని ప్రారంభంలో జిల్లా ఎస్పి చందాన దీప్తి

ముద్ర ప్రతినిధి, నల్గొండ: పోలీస్‌ కొలువు సాధించిన ప్రతి ఒక్కరూ గర్వపడాలని జిల్లా ఎస్పీ చందనా దీప్తి అన్నారు. జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రంలో నూతనంగా ఎంపికైన ట్రైనీ కానిస్టేబుల్స్ కు 9 నెలల శిక్షణ నిమిత్తం సంగారెడ్డి, కామారెడ్డి, వికారాబాద్ జిల్లాల నుండి వచ్చిన ఏఆర్ విభాగానికి చెందిన 203 మంది పురుష అభ్యర్థుల శిక్షణ కార్యక్రమ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆమే ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వల చేసి ప్రారంభించారు. ఈ సందర్బంగా నూతన ట్రైనీ కానిస్టేబుళ్ళకు ముందుగా అభినందనలు తెలిపి మాట్లాడుతూ వేలాది మంది అభ్యర్థులతో పోటీపడి తుది పరీక్షలో అర్హత సాధించి  ఎంపికై శిక్షణ కోసం  పోలీస్‌ శిక్షణా కేంద్రానికి వచ్చి తొమ్మిది నెలలు పాటు క్రమశిక్షణతో వ్యహరిస్తూ శిక్షణ సమయంలో ఇండోర్ మరియు ఔట్ డోర్ లలో శిక్షకుడు తెలిపే ప్రతి అంశాలపై పట్టు సాధిస్తూ తొమ్మిది నెలలు పూర్తి చేసుకొని ముందుకు సాగాలని అన్నారు.

పోలీస్ శాఖలో సమాజంలో ప్రజా సేవ చేయుటకు మంచి అవకాశం ఉంటుందని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రజా సేవ చేస్తూ సమాజంలో మంచి గుర్తింపు పొందాలని అన్నారు. ఈ తోమ్మిది నెలల పాటు కోనసాగే ఈ శిక్షణ  విజయవంతంగా పూర్తికొని అప్పగించిన విధుల్లో రాణిస్తూ ముందు ముందు ఉన్నత స్థాయిలకు వెళ్తూ పోలీస్ శాఖకు మీ కుటుంబ సభ్యులకు మంచి పేరు ప్రతిష్టలు తేవాలని అన్నారు. ఈ కార్యక్రమములో డిటిసి ప్రిన్స్‌పాల్‌ అడిషనల్ ఎస్పీ రాములు నాయక్‌, వైస్‌ ప్రిన్స్‌పాల్‌ డిఎస్పీ విఠల్ రెడ్డి, యస్బి డీఎస్పీ రమేష్, సైబర్ క్రైమ్ డిఎస్పీ లక్ష్మి నారాయణ, సిఐలు గోపి, సత్యనారాయణ, కొండల్ రెడ్డి, కరుణాకర్, ఆర్ఐలు హరిబాబు, సూరప్ప నాయుడు, యస్ఐలు, ఆవుట్‌ డోర్‌, ఇన్‌డోర్‌ సిబ్బంది తదితరులు పాల్గోన్నారు.