దీర్ఘకాలిక పెండింగ్ కేసులకు పరిష్కారం చూపాలి

 దీర్ఘకాలిక పెండింగ్ కేసులకు పరిష్కారం చూపాలి
  • గుర్తుతెలియని మృతదేహాల కేసులు త్వరితగతిన చేదించాలి.
  • గంజాయి వల్ల జరిగే అనర్థాలను యువతకు వివరించాలి.
  • రాబోవు ఎన్నికల్లో విధులు నిర్వహణకు సిబ్బంది సిద్దంగా ఉండాలి.
  • పోలీసు అధికారులకు ఆదేశాలు చేసిన జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే 

ముద్ర ప్రతినిధి సూర్యాపేట:-దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న కేసుల పరిష్కారానికి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని రాబోవు ఎన్నికల్లో విధుల నిర్వహణకు పోలీస్ సిబ్బంది సిద్ధంగా ఉండాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే చెప్పారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం ఎస్పీ రాహుల్ హెగ్డే , అదనపు ఎస్పి నాగేశ్వరావు, ట్రైనీ ఐపిఎస్ అధికారి రాజేష్ మీనా తో కలిసి పోలీసు అదికారుల నెలవారీ సమీక్షా సమావేశం నిర్వహించారు. గత నెలలో జరిగిన కేసుల నమోదు, కేసుల దర్యాప్తు, పెండింగ్ కేసులు, కోర్టు విధులు, కేసుల్లో శిక్షల అమలు, క్వాలిటి ఆఫ్ ఇన్వెస్టిగేషన్, సిసి టిఎన్ఎస్, అన్-లైన్, పోలీసు పని విభాగాలు, డయల్ 100 పిర్యాదుల పై సిబ్బంది స్పందన, పిటిషన్ మెంజ్మెంట్ సిస్టం, రిషప్షన్ నిర్వహణ లాంటి అమశాలపై చర్చించి సూచనలు చేశారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ దీర్ఘకాలిక పెండింగ్ కేసులు త్వరగా పరిష్కరించాలని, గుర్తుతెలియని మృతదేహాల సంబంధిత కేసులను త్వరితగతిన చేదించాలని ఎస్సైలను, సీఐ లను ఎస్పి  ఆదేశించారు. డీఎస్పీలు లు నిత్యం పర్యవేక్షణ చేయాలని సూచించారు
సామాజిక అంశాలు, గంజాయి వల్ల అనర్థాలు, సైబర్ మోసాల నుండి రక్షణ పొందటం అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రణాళిక ప్రకారం పని చేయాలి అని ఆదేశించారు.

ప్రజలతో మంచి సంభందాలు కొనసాగించాలని, సామాజిక అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. గంజాయి నివారణ కోసం నిరంతర కృషి చేయాలనీ, గంజాయి నివారణలో ప్రజల భాగస్వామ్యం చేయాలనీ, విద్యాసంస్థల్లో యాంటీ డ్రగ్ కమిటీలు ఏర్పాటు చేయించాలనీ, గంజాయి వల్ల కలిగే అనర్థాలను యువతకు వివరించాలని కోరారు. రాబోవు ఎన్నికల నిర్వహణకు సిబ్బంది అంతా సిద్దంగా ఉండాలని, ఎన్నికల బందోబస్తుకు ముందునుండే ప్రణాళిక చేసుకోవాలని సూచించారు. పోలీస్ స్టేషన్ స్థాయిలో ప్రతి రోజూ రోల్ కాల్స్ నిర్వహించి విధుల నిర్వహణపై సిబ్బందికి నిర్దేశాలు తెలపాలని ఎస్పి  చెప్పారు.

సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందించిన ఎస్పి

జిల్లాలో చాలా కేసుల్లో నేరస్తులకు శిక్షలు పడుతున్నాయని ఎస్పి  అన్నారు. నాణ్యమైన దర్యాప్తు చేస్తూ త్వరితగతిన నేర అభియోగ పత్రాలను కోర్టులకు అందించటం  శిక్షల శాతం పెరిగిందని, సిబ్బంది అందరినీ అభినందిస్తున్నానని చెప్పారు.  ఈసందర్భంగా నేరెడుచర్ల, మోతే పోలీసు స్టేషన్ల పరిధిలో నమోదైన పోక్సో చట్టం కేసుల్లో గతంలో ఇద్దరు నేరస్తులకు జీవితఖైదు శిక్షలు విధిస్తూ కోర్టు ఉత్తర్వులు ఇవ్వడం జరిగినదని, జీవితఖైదు ఉత్తర్వులు అమలైయ్యేలా పని చేసిన కోర్టు కానిస్టేబుల్ లకు, బరోసా సెంటర్ సిబ్బందికి డిజిపి కార్యాలయం, మహిళా రక్షణ విభాగం వారు అందించిన ప్రశంసా పత్రాలను ఎస్పి  బరోసా సెంటర్ మహిళ ఎస్సై మౌనిక, ఏఎస్ఐ సైదాబి, నెరెడుచర్ల పోలీస్ స్టేషన్ కోర్టు కానిస్టేబుల్ లింగయ్య, మోతే పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ రవీందర్ లకు అందించారు.ఈ కార్యక్రమంలో సూర్యాపేట, కోదాడ డి.ఎస్.పి లు రవి, శ్రీధర్ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ లు రాజేష్, శివకుమార్, డిసిఆర్బి ఇన్స్పెక్టర్ రామలింగారెడ్డి, సిసిఎస్ ఇన్స్పెక్టర్ వీర రహవులు, సీఐ లు రాజశేఖర్, రాము, రజిత రెడ్డి, సురేందర్ రెడ్డి, రామకృష్ణా రెడ్డి,  శ్రీను, రఘువీర్ రెడ్డి, సైబర్ సెక్యూరిటీ ఇన్స్పెక్టర్ లక్ష్మినారాయణ, ఎస్సై లు, ఐటీ  కోర్, డి సి ఆర్ బి సిబ్బంది పాల్గొన్నారు.

నార్కోటిక్ డాగ్ రోలెక్స్ కు అల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్ నందు సిల్వర్ మెడల్.

ఈనెల 16 వ తేదీన లక్నోలో జరిగిన 67వ  ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్ నందు సూర్యాపేట జిల్లా పోలీసు విభాగానికి చెంది నార్కోటిక్ డాగ్ రోలెక్స్ ఉత్తమ ప్రతిభ చూపి నార్కోటిక్ పదార్థాల గుర్తింపు లో సిల్వర్ మెడల్ గెలిచింది. ఈ సందర్భంగా ఈరోజు జిల్లా ఎస్పి రాహుల్ హెగ్డే  తన కార్యాలయం నందు డాగ్ రోలెక్స్ కు వెడల్ అందించారు. అనంతరం డాగ్ హ్యండిలర్ సతీష్ ను, ఇంచార్జీ అధికారులను అభినందించారు. ఈ కార్యక్రమం నందు అదనపు ఎస్పి నాగేశ్వరరావు, ఆర్ముడ్ రిజర్వ్ అదనపు ఎస్పీ జనార్ధన్ రెడ్డి, ఆర్ ఐ నర్సింహ, ఆర్ఎస్ఐ లు సురేష్, రాజశేఖర్, సిబ్బంది ఉన్నారు.