డిఎస్పి ఆనంద రెడ్డి  సేవలు జిల్లాకు చిరస్మరణీయమైనవి - జిల్లా ఎస్పీ  రక్షిత కె మూర్తి

డిఎస్పి ఆనంద రెడ్డి  సేవలు జిల్లాకు చిరస్మరణీయమైనవి - జిల్లా ఎస్పీ  రక్షిత కె మూర్తి

ముద్ర.వనపర్తి ప్రతినిధి:- వనపర్తి జిల్లాలో డిఎస్పీ  గా విధులు నిర్వహించి బదిలీ అయిన  ఆనంద రెడ్డి సేవలు జిల్లాకు చిరస్మరణీయమైనవి అని జిల్లా ఎస్పీ  రక్షిత కె మూర్తి అన్నారు.ఈ సందర్భంగా వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు.కార్యక్రమంలో జిల్లా ఎస్పీ  రక్షిత కె మూర్తి మాట్లాడుతూ వనపర్తి జిల్లాలో డిఎస్పీ  గా 02.03.2022 నుండీ 16.02.2024 వరకు విధులు నిర్వహించిన  ఆనంద రెడ్డి ఎన్నో పోలీస్ సమస్యలను తన అనుభవంతో పరిష్కరించారన్నారు. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నోడల్ అధికారిగా తన బాధ్యతలను ఎంతో సమర్థవంతంగా నిర్వహించారని కొనియాడారు.  మదనాపురం పోలీస్ స్టేషన్లో ఒక కేసులో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా ఉండి చాలా చక్కగా ఇన్వెస్టిగేషన్ చేసి నేరస్తునికి 20 సంవత్సరాలు శిక్ష పడేలా ఇన్వెస్టిగేషన్ చేశారని ఆనంద రెడ్డి  ఎస్పీ శుభాకాంక్షలు తెలిపారువనపర్తి జిల్లాలోని సి ఐ లు మరియు ఎస్సై లు సైతం ఆనంద రెడ్డి  సేవలను కొనియాడారు.

డీఎస్పీ ఆనంద రెడ్డి మాట్లాడుతూ వనపర్తి జిల్లాలో సేవలు అందించటం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందన్నరు. వనపర్తి డిఎస్పీగా సమర్థవంతంగా పనిచేసేందుకు తోటి పోలీసులు, ప్రజలు, పాత్రికేయులు ఇచ్చిన సహకారం మరువలేనని ఆనంద రెడ్డి అన్నారు.కష్టకాలంలో విధులు నిర్వహించవలసి వచ్చిన అన్నిటిని అధిగమించి పనిచేయగలిగానని చెప్పారు ఆయన బదిలీ అయిన సందర్భంగా జిల్లాలోని ఎస్పీ  రక్షిత కె మూర్తి, జిల్లా అడిషనల్ ఎస్పీ  శ్రీరామదాసు తేజావత్, జిల్లా లోని సిఐలు ఎస్సైలు సిబ్బంది  ఆనంద రెడ్డి ని సన్మానించారు.అనంతరం కొత్తగా వచ్చిన డిఎస్పీ  జే వెంకటేశ్వరరావు కు జిల్లా పోలీసులు స్వాగతం పలికారు.  డిఎస్పి వెంకటేశ్వరరావు  మాట్లాడుతూ జిల్లాలోని శాంతిభద్రతలను కాపాడేందుకు పూర్తిస్థాయిలో పనిచేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ శ్రీ రామదాసు తేజావత్, వనపర్తి జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీ మధుసూదన్, వనపర్తి సిఐ నాగభూషణం, కొత్తకోట సీఐ  రత్నం, ఆత్మకూరు సిఐ  శివకుమార్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు  శ్రీనివాస్, అప్పలనాయుడు, జిల్లాలోని ఎస్ఐలు  డిసిఆర్బి సిబ్బంది పాల్గొన్నారు.