నలుగురు దొంగలను పట్టుకున్న మద్దిరాల, సి‌సి‌ఎస్ పోలీసులు...

నలుగురు దొంగలను పట్టుకున్న మద్దిరాల, సి‌సి‌ఎస్ పోలీసులు...
  • నిందితులపై 18 ట్రాక్టర్ ట్రాలీ దొంగతనం కేసులు గుర్తింపు.
  • రైతుల ట్రాక్టర్ ట్రాలీలు లక్ష్యంగా దొంగతనం.
  • 19 ట్రాక్టర్ ట్రాలీలు, ఒక బైక్, ఒక స్వరాజ్ ఇంజన్ స్వాదినం.
  • సూర్యాపేట జిల్లాలో 11 దొంగతనాలు, నల్గొండ జిల్లాలో 7  దొంగతనాలకు పాలడినారు.
  • సీజ్ చేసిన వాహనాల మొత్తం విలువ రూ.22,92,000/-
  • నలుగురు నిందితులు రిమాండ్ కు తరలించడం జరిగినది.
  • జిల్లా పోలీసు కార్యాలయం నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసు వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్.

సూర్యాపేట ముద్ర ప్రతినిధి :-నిందితులు గ్రామాలలో, పొలాల వద్ద రక్కి చేసి పొలాల వద్ద, రోడ్ల పక్కన రైతులు పెట్టిన ట్రాక్టర్ ట్రక్కు లను గుర్తించి దొంగలిస్తారని ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ వెల్లడించారు. ఇలా దొంగలించిన ట్రాలీలను తక్కువ ధరకు ఇతర రైతులకు అమ్మడం చేస్తున్నారని గుర్తించామని ఎస్పి  అన్నారు.

కేసు వివరాలు..

ఈనెల 13న సాయంత్రం మద్దిరాల ఎస్‌ఐ తన సిబ్బందితో మద్దిరాల అడ్డ రోడ్డు వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా కుంటపల్లి వైపు నుంచి టీఎస్ 05 ఎఫ్ ఎస్  5840 నంబర్ గల పల్సర్ బైక్‌పై ఇద్దరు, స్వరాజ్ ట్రాక్టర్ ఇంజన్‌పై ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా వస్తుండగా, వారిని గమనించిన మద్దిరాల ఎస్‌ఐ. తన సిబ్బందితో కలిసి నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించడం జరిగినదని ఎస్పీ చెప్పారు. నల్గొండ జిల్లాకు చెందిన  నింధితులు నలుగురు సంపంగి మహేశ్, సంపంగి సత్యం, ఒర్సు వెంకన్న, అలకుంట్ల మహేశ్ కలిసి 2023 అక్టోబర్‌ నెలలో పోలుమళ్ల గ్రామం నుంచి చిల్పకుంట్ల గ్రామానికి వెళ్లే మార్గంలో పొలాల్లో, రోడ్డు పక్కన లో షెడ్లలో ఉంచిన 2 ట్రాక్టర్‌ ట్రాలీలను దొంగతనం చేసినట్లు అంగీకరించారన్నారు. దీనిపై పోలుమల్ల గ్రామానికి చెందిన ఎల్లు జగన్, రామారెడ్డిలు మద్దిరాల పీఎస్‌లో పిర్యాధు చేసినారన్నారు. బాధితుల పిర్యాధు మేరకు మద్దిరాల పీఎస్‌లో నేరం సంఖ్య 206/2023, సెక్షన్ 379 ఐపి్‌సి ప్రకారం కేసు నమోదు చేయడం జరిగిందని,  నింధితులు నేరాలకు పాల్పడినట్లు ఒప్పుకున్నారని వివరించారు.  ట్రాలీల చోరీ కేసులో నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేయడం జరిగినదని ఎస్పీ  చెప్పారు.

విచారణలో భాగంగా నింధితులు మునగాల, పెన్ పహాడ్, మిర్యాలగూడ రూరల్‌, నాగారం, మద్దిరాల, గుర్రంపోడు, నూతనకల్‌, మోతె, గరిడేపల్లి, శాలిగౌరారం, సూర్యాపేట రూరల్‌, కేతేపల్లి పోలీస్‌ స్టేషన్ల పరిధిలో మొత్తం 18 ట్రాక్టర్ల ట్రాలీలు చోరీ కేసులున్నట్లు నిందితులు అంగీకరించారన్నారు. గుర్తించిన కేసుల్లో 19 ట్రాక్టర్ ట్రాలీలు, ఒక ఇంజన్, ఒక బైక్‌ను స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్‌కు తరలించడం జరిగిందన్నారు. నల్గొండ జిల్లా హాలియా మండలం మారేపల్లి గ్రామం ఏ1 ఇంటి నుంచి 20 లక్షల 92 వేలు విలువగల మొత్తం 19 ట్రాలీలు, నిందితులు పట్టుబడి సమయంలో ఉపయోగించిన 2 లక్షల విలువగల  ఒక స్వరాజ్ ట్రాక్టర్ ఇంజన్, ఒక పల్సర్ బైక్ స్వాదినం చేసుకోవడం జరిగినదని, సూర్యాపేట జిల్లాలో 11 దొంగతనాలు, నల్గొండ జిల్లాలో 7  దొంగతనాలకు పాలడినారని తెలిపారు.  ఈ 18 కేసులు కాకుండా నింధితులు A1-సంపంగి మహేశ్, A2-సంపంగి సత్యం, A3-ఒర్సు వెంకన్న గతములో 12 కేసుల్లో నేర చరిత్ర కలిగి ఉన్నారని, ఏ వన్ మహేష్, ఏ 3 వెంకన్న లను రాచకొండ కమిషనరేట్ ఆదిభట్ల పోలీసు స్టేషన్ వారు ట్రాక్టర్ ట్రాలీ కేసులో జైలుకు పంపారని ఎస్పీ వెల్లడించారు. 

ఈ కేసుల చేధనలో బాగా పని చేసిన సిసిఎస్ ఇన్స్పెక్టర్ శివ కుమార్, తుంగతుర్తి సిఐ శ్రీను, సి సి ఎస్ ఎస్ ఐ శ్రీకాంత్, మద్దిరాల ఎస్సై వీరన్న, పర్యవేక్షణ చేసిన డి.ఎస్.పి రవి, సిసిఎస్ సిబ్బంది వెంకన్న, శ్రీనివాస్, గురు స్వామి, మల్లేష్, ఆనంద్, శివ, సతీష్, ప్రభాకర్ లను ఎస్పీ  అభినందించి రివార్డ్ అందించారు.ఈ విలేకరుల సమావేశంలో  ఏ ఆర్ అదనపు ఎస్పి జానార్ధన్ రెడ్డి, సూర్యాపేట డీఎస్పీ రవి, తుంగతుర్తి సిఐ శ్రీను, సి సి ఎస్ ఇన్స్పెక్టర్ శివ కుమార్, ఎస్సై లు శ్రీకాంత్, వీరన్న, సిసిఎస్ సిబ్బంది ఉన్నారు.