కేంద్ర సాయుధబలగాల అధికారులను సత్కరించిన  జిల్లా ఎస్పీ

కేంద్ర సాయుధబలగాల అధికారులను సత్కరించిన  జిల్లా ఎస్పీ

ముద్ర.వనపర్తి:- పార్లమెంట్‌ ఎన్నికలను పురస్కరించుకొని ఎన్నికల బందోబస్తు విధులు నిర్వహించి తిరిగి పశ్చిమ బెంగాల్ కు వెళ్తున్న కేంద్ర సాయుధ బలగాలకు చెందిన అధికారులను వనపర్తి జిల్లా ఎస్పీ  రక్షిత కె మూర్తి బుధవారం రోజున ఘనంగా సత్కరించి జ్ఞాపికలను అందజేసారు.

ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ స్థానిక పోలీసులతో పాటు కేంద్ర సాయుధబలగాలు సమన్వయం కల్సి పనిచేయడం ద్వారా ఎలాంటి సంఘటన జరగకుండా పూర్తిస్థాయిలో ప్రశాంతవంతమైన వాతవరణంలో ఎన్నికలు నిర్వహించబడ్డాయని, ఎన్నిక ప్రశాంతంగా నిర్వహించడంలో బందోబస్తు విధులు నిర్వహించిన ITBP అధికారులు, సిబ్బందికి జిల్లా ఎస్పీ  అభినందించారు.సత్కారం పొందినవారిలో శ్రీరాము కుమార్ మండల్, AC/ CCD ITBP, చంద్ర కాంట బిస్వాస్‌, ఇంటలిజెన్స్, ITBP, P.V. స్వామీ, క్వార్టర్ మాస్టర్ లు వున్నారు.ఈ కార్యక్రమములో  అడిషనల్ ఎస్పీ ఏ ఆర్ శ్రీ వీరారెడ్డి గారు రిజర్వ్ ఇన్స్పెక్టర్ అప్పలనాయుడు గారు పాల్గొన్నారు.