యువత తలుచుకుంటే ప్రమాదాలను నివారించగలం

యువత తలుచుకుంటే ప్రమాదాలను నివారించగలం
  • జిల్లా ఎస్పీ రక్షిత కె మూర్తి
  • జనవరి 15 నుండి ఫిబ్రవరి 14 వరకు 35 వ జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాల పై అవగాహన కార్యక్రమాలు.
  • ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటించాలి.
  • 35వ జాతీయ రోడ్డు భద్రతపై, ప్రమాదాల నివారణకై అవగాహన సదస్సులో పాల్గొన్న జిల్లా ఎస్పీ.

ముద్ర.వనపర్తి ప్రతినిధి:-అతివేగంగా, నిర్లక్ష్యంగా వాహనాన్ని నడిపే సమయంలో కుటుంబ సభ్యులను మదిలో ఉంచుకోవాలని,యువత తలుచుకుంటే ప్రమాదాలను నివారించగలమని వనపర్తి జిల్లా ఎస్పీ రక్షిత కె మూర్తి అన్నారు.జనవరి 15 నుండి ఫిబ్రవరి 14 వరకు నిర్వహించే రోడ్డు భద్రత కార్యక్రమాలలో  పెద్దమందడి మండలం మోజర్ల గ్రామం దగ్గరలో గల ఉద్ద్యాన కృషి కాలేజ్  నందు వెస్టన్ ఆంధ్రా టోల్ ప్లాజా ప్రవేట్ లిమిటెడ్ శాఖాపూర్ వారు నిర్వహించిన రోడ్డు భద్రతపై జరుగు అవగాహన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శ రక్షిత కె మూర్తి ముఖ్యఅతిథిగా పాల్గొనడం జరిగింది. మొదటగా ఎస్పీ ని కళాశాల ప్రిన్సిపాల్ బృందం  పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు.  తరువాత వెస్టన్ ఆంధ్ర టోల్ ప్లాజా ప్రవేట్ లిమిటెడ్, ప్రాజెక్ట్ హెడ్ దీపా మాడయ,  జిల్లా ఎస్పీ  రక్షిత కె మూర్తి కి స్వాగతం పలికి కార్యక్రమాన్ని ప్రారంభించారు.కళాశాల విద్యార్థుల తో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పురాతన కాలం నుండి కొనసాగుతున్న పద్ధతి నివారణ కంటే నిరోధన ఉత్తమం అని, ప్రమాదాల సంఖ్య తగ్గుముఖం పడుతుందని అన్నారు.

ప్రమాదం సంభవించినప్పుడు బాధపడే కన్నా ప్రమాదం జరగకముందు జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమమని సూచించారు. జనవరి 15వ తారీఖున నుండి ఫిబ్రవరి 14 వ తారీకు వరకు జరుగు రోడ్డు భద్రత వారోత్సవాలలో ప్రజలకు, విద్యార్థినీ విద్యార్థులకు, ఆటో డ్రైవర్లకు లారీ డ్రైవర్లకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రమాదాల బారిన పడకుండా తీసుకోవలసిన జాగ్రత్తలను తెలియజేస్తూ చైతన్య పరిచే కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రమాదాల బారిన ఎక్కువ మొత్తంలో పడే యువత వాహనాన్ని నడిపే క్రమంలో తమ కుటుంబ సభ్యులను మదిలో ఉంచుకుంటూ భవిష్యత్తును దృష్టిలో ఉంచుతూ వాహనాన్ని నడపాలని సూచించారు. వాహనాన్ని నడిపే క్రమంలో ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని నిర్లక్ష్యంగా అతివేగంతో వాహనాలను నడపకూడదని అన్నారు. ప్రమాదం సంభవించడం వేగం ఈ రెండు అంశాలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయని వేగాన్ని  పెంచినప్పుడు ప్రమాదాల సంఖ్య పెరుగుతుందని వేగాన్ని తగ్గించినప్పుడు ప్రమాదాల సంఖ్య తగ్గుతుందనే అంశాన్ని విద్యార్థులకు వివరించారు. అతివేగం గా వాహనాన్ని నడిపితే ఆనందం వస్తుంది అనే ఆలోచనతో కాకుండా ప్రమాదం ఏ విధంగానైనా సంభవిస్తుంది అనే ఆలోచనతో ముందుకు సాగాలని సూచించారు. హెల్మెట్ ధరించి వాహనాన్ని నడిపినప్పుడు ప్రమాదం జరిగినా గాయాలు కాకుండా బ్రతికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అని తెలిపారు.ఈ కార్యక్రమంలో వెస్ట్రన్ ఆంధ్ర టోల్ ప్లాజా ప్రవేట్ లిమిటెడ్ శాఖాపూర్ ప్రాజెక్టు హెడ్ M.దీపా,కళాశాల డీన్ శ్రీ సైదయ్య,ఆపరేషన్స్ మేనేజర్ సంతోష్,మెయిన్టెనెన్స్ మేనేజర్ బాలమురుగన్,రూట్ మేనేజర్ రాకేష్ గౌడ్ , టోల్ ప్లాజా సిబ్బంది,
కళాశాల సిబ్బంది, పెద్దమందడి ఎస్సై శివకుమార్   పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు..