విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగించరాదు. 

విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగించరాదు. 
  • షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ 
  • విద్యుత్ శాఖ అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష 

షాద్ నగర్, ముద్ర: వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని విద్యుత్ అంతరాయం లేకుండా సరఫరా చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని షాద్ నగర్ ఎమ్మెల్యే శంకర్ సూచించారు. గురువారం డివిజన్ స్థాయి విద్యుత్ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని కోతలు లేకుండా విద్యుత్ను సరఫరా చేయాలని సూచించారు గృహ వినియోగ దారులతో పాటు రైతులకు నిరంతర విద్యుత్తు అందించేందుకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యుత్ సరఫరా లో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ట్రాన్స్ఫార్మర్ల సమస్య ఏమైనా ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరించేందుకు కృషి చేస్తామని వివరించారు.

విద్యుత్ సరఫరా లో అధికారులు కొంత నిర్లక్ష్యం వహిస్తున్నారు విషయం తమ దృష్టికి వచ్చిందని మరో మరో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. షాద్ నగర్ డివిజన్ కు ఎంత మేరకు విద్యుత్ వినియోగ డిమాండ్ ఉందో ఆ వివరాలను తమకు ఇవ్వాలని తెలిపారు. ఈ రెండు నెలలు పరీక్షల సమయం కాబట్టి విద్యుత్ నిరంతరంగా సరఫరా చేయాలని అదేవిధంగా అన్నదాతలకు విద్యుత్తును అందించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. కొత్త కనెక్షన్ల విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహించకుండా తక్షణమే వచ్చేందుకు చూడాలని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యుత్ సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు విద్యుత్ అధికారులు చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో ఉన్న అధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లాల్సి వస్తుందని వివరించారు. ప్రభుత్వానికి విద్యుత్ అధికారులు సహకరించాలని పేర్కొన్నారు. ఈ సమీక్ష సమావేశంలో విద్యుత్ అధికారులు ఎస్ ఈ గోపయ్య గారు, డిఈ యాదయ్య, ఎడి రవీందర్, మాధవరావు మరియు వివిధ మండలాల ఏఈలు పాల్గొన్నారు