కూలిన ఇండ్లలో ఉండరాదు

కూలిన ఇండ్లలో ఉండరాదు
  • ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలి.
  • మెదక్ ఎమ్మెల్యే యం. పద్మ దేవేందర్ రెడ్డి
  • కలెక్టరేట్ నిర్మాణ పనులు పరిశీలన

ముద్ర ప్రతినిధి, మెదక్:మెదక్ జిల్లాలో భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో పాత ఇండ్లలో ప్రజలు  ఉండవద్దని సురక్షిత ప్రాంతలకు  వెళ్లాలని మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి సూచించారు. శుక్రవారం మెదక్  పట్టణంలో సుడిగాలి పర్యటన  చేశారు. నూతనంగా నిర్మిస్తున్న కలెక్టరేట్ భవనం పనులను పరిశీలించారు. 

ఈ సందర్భంగా  మాట్లాడుతూ.. కూలిన ఇండ్ల వద్ద తక్షణ చర్యలు చేపడుతూ ఇండ్లు నిర్మించుకోవడానికి మూడు లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందజేస్తామన్నారు.భారీ వర్షాల పడుతున్న నేపథ్యంలో చెరువుల కట్టలు తెగే అవకాశం ఉన్నందున ఇరిగేషన్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని  సూచించారు. మెదక్ జిల్లాలో వర్షాలు పడి అక్కడక్కడ ఇబ్బందికర పరిస్థితి ఏర్పడిందన్నారు.. ఎప్పటికప్పుడు అధికారులతో ప్రజాప్రతినిధులతో సమీక్షించి పర్యవేక్షణ చేస్తు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు.

మెదక్ నియోజకవర్గంలో ఎక్కడ ఏ సమస్య ఉన్న తక్షణమే స్పందిస్తూ  పాలకవర్గం ప్రజాప్రతినిధులు తిరుగుతూ సహాయక చర్యలు చేపడుతున్నారని తెలిపారు.మెదక్ పట్టణంలో ఎంఎన్ కెనాల్ పొంగిపొర్లడం వలన పట్టణంలో కొన్ని కాలనీల్లో  నీళ్లు వచ్చాయని అగ్నిమాపక సిబ్బంది సహాయ సహకారాలు తీసుకుని  రోడ్ పైకి నీళ్ళు రాకుండా చర్యలు చేపట్టామని పేర్కొన్నారు.అవసరం ఉన్న చోట రోడ్ల మరమ్మతులు, డ్రైన్స్ నిర్మిoచాలని  అధికారులకు ఆదేశాలుఇవ్వడం  జరిగిందన్నారు. వెంట మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, ఆత్మ కమిటీ చైర్మన్ అంజాగౌడ్, హవేళిఘనపూర్ మండలం పార్టీ అధ్యక్షులు సిహెచ్  శ్రీనివాస్ రెడ్డి, నాయకులు రాగి అశోక్, శ్రీధర్ యాదవ్, సాయిరాం, పడాల సతీష్, గంజి నవీన్ తదితరులు ఉన్నారు.