జీవితాన్ని నిలబెట్టిన జీవన్దాన్

జీవితాన్ని నిలబెట్టిన జీవన్దాన్
  • రెండు కిడ్నీలు చెడిపోయిన బాధితుడికి స్వాoతన

ముద్ర ప్రతినిధి , కోదాడ :- పిన్న వయసులో రెండు కిడ్నీలు చెడిపోయి డయాలసిస్ ద్వారా జీవితాన్ని నెట్టుకొస్తున్న కోదాడ కు చెందిన ఒక యువకుడికి జీవన్దాన్ ట్రస్ట్ ద్వారా ఉచితంగా కిడ్నీ మార్పిడి చేసి అతని జీవితంలో వెలుగులు నింపారు యశోద హాస్పిటల్ వైద్యులు . జీవన్దాన్ ట్రస్ట్ లో పేర్లు నమోదు చేసుకున్న బాధితులకు అవసరమైన అవయవాలు ఈ ట్రస్ట్ ద్వారా అందించబడతాయని , అవయవాలు అవసరమైన బాధితులు అందరు ఈ ట్రస్ట్ సేవలను ఉపయోగించుకోవాలని కోరారు . కోదాడ కు చెందిన షేక్ ఫయాజ్ 32 సంవత్సరాల వయసులో నే రెండు మూత్రపిండాలు చెడిపోయి ప్రతిరోజూ డయాలసిస్ తో రక్తం శుద్ధి చేసుకోవాల్సిన అవసరం ఏర్పడిందని , ఈ క్రమంలో ఆయన హైదరాబాద్ లోని యశోద హాస్పిటల్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ శశికిరణ్ ను సంప్రదించగా ఆయన సూచన మేరకు జీవన్దాన్ ట్రస్ట్ లో ఫయాజ్ తన పేరును నమోదు చేసుకున్నారు . రెండు నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో చనిపోయిన ఒక యువకుడి కిడ్నీ అందుబాటులో ఉందని జీవన్దాన్ ట్రస్ట్ వారు  యశోద హాస్పిటల్ కు సమాచారం ఇచ్చారు . యశోద హాస్పిటల్ యాజమాన్యం ఫయాజ్ ను పిలిచి ఒక కిడ్నీ మార్పిడి చేయగా ఆయన ప్రస్తుతం సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారని అతని కుటుంబసభ్యులు తెలిపారు . 

జీవన్దాన్ ట్రస్ట్ లో పేర్లు నమోదు చేసుకోవాలి

పేద రోగులకు జీవన్దాన్ ట్రస్ట్ ఎంతో ఉపయోగపడుతుందని , అవయవ మార్పిడి అవసరమైన బాధితులు తమ పేర్లను జీవన్దాన్ ట్రస్ట్ లో నమోదు చేసుకోవాలి అని ఈ ట్రస్ట్ ద్వారా దాతలు అవసరం లేకుండానే అవసరం అయిన అవయవాలు లభ్యం అవుతాయని యశోద హాస్పిటల్ యాజమాన్యం తెలిపారు . అవసరం అయినా వారు హాస్పిటల్ యాజమాన్యాన్ని సంప్రదించాలని కోరారు .