లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అన్నదానం

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అన్నదానం

ముద్ర, స్టేషన్ ఘన్ పూర్: లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ అంతర్జాతీయ డైరెక్టర్ లయన్ డా.గట్టమనేని బాబురావు పుట్టినరోజు సందర్భంగా లయన్స్ క్లబ్ శివునిపల్లి ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, బస్టాండ్, గ్రామ పంచాయతీ సమ్మె శిబిరంలో ఆదివారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ శివునిపల్లి అధ్యక్షుడు బత్తిని సురేందర్, కార్యదర్శి గౌరిశెట్టి అనిల్, కోశాధికారి చిలువేరు నాగేశ్వరరావు, చార్టర్ ప్రెసిడెంట్ మంగు జయప్రకాశ్, చార్టర్ ట్రెజరర్ పిట్టల మహేందర్, మహమ్మద్ దస్తగిరి, తుమ్మనపల్లి రవికిరణ్, అడికే సతీశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.