కోదాడ లో వెటర్నరీ మెడికల్ ఏజన్సీ పై డ్రగ్ కంట్రోల్ అధికారుల దాడులు

కోదాడ లో వెటర్నరీ మెడికల్ ఏజన్సీ పై డ్రగ్ కంట్రోల్ అధికారుల దాడులు

ముద్ర ప్రతినిధి , కోదాడ :  కోదాడ పట్టణంలోని హుజూర్ నగర్ రోడ్ లో శ్రీ నందిని వెటర్నరీ పై డ్రగ్ కంట్రోల్ అధికారులు దాడులు నిర్వహించారు . అనుమతి లేకుండా నిల్వ ఉంచిన నాలుగు లక్షల ఇరవై మూడు వేల రూపాయల మందులను సీజ్ చేసినట్లు అసిస్టెంట్  డ్రగ్ కంట్రోలర్ దాస్ తెలిపారు . ఇందులో 17 వేల రూపాయల గడువు తీరిన మందులను , ఆరు వేల రూపాయల నమూనా మందులను (శాంపిల్స్) గుర్తించినట్లు అధికారులు తెలిపారు . టోల్ ఫ్రీ ద్వారా వచ్చిన ఫిర్యాదుతో దాడులు చేసినట్లు ఆయన తెలిపారు . గత కొంత కాలంగా కోదాడ లో మెడికల్ దుకాణాలపై దాడులు నిర్వహిస్తున్నా దుకాణ యాజమాన్యులలో మార్పు రాకపోవడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు . ఇక నుండి అయినా మెడికల్ దుకాణ యజమానులు సరైన నిబంధనలు పాటించాలని మున్ముందు మరిన్ని దాడులకు ఆస్కారం ఉందని ఆయన తెలిపారు . ఈ దాడులలో సూర్యాపేట డ్రగ్ ఇన్సపెక్టర్ సురేందర్ తో పాటు నల్లగొండ , భువనగిరి డ్రగ్ ఇన్సపెక్టర్లు , ఆఫీస్ సిబ్బంది  పాల్గొన్నారు