అకాల వర్షాల వల్ల దాదాపు 10 వేళ ఎకరాలల్లో వరి రైతులు పూర్తిగా నష్టపోయారు

అకాల వర్షాల వల్ల దాదాపు 10 వేళ ఎకరాలల్లో వరి రైతులు పూర్తిగా నష్టపోయారు

రైతులకు రెండు రోజుల్లోగా నష్టపోయిన పంటకు పరిహారం చెల్లించాలి-బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇంఛార్జి కాటిపల్లి వెంకట రమణ రెడ్డి

ముద్ర ప్రతినిధి, కామారెడ్డి: రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని బీజేపీ కామారెడ్డి నియోజకవర్గ ఇంచార్జి కాటిపల్లి వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం రాత్రి కామారెడ్డి నియోజకవర్గం పరిధిలో అకాల వర్షం, వడగళ్ల వాన కారణంగా నష్టపోయిన పంటను బీజేపీ బృందం  పరిశీలించింది.

అనంతరం బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇంఛార్జి కాటిపల్లి వెంకట రమణ రెడ్డి మాట్లాడుతూ -
రైతుల కన్నీళ్లు కదిలించాయనీ రైతులకు చేతికందిన పంట నెల పాలయ్యిందనీ, పెట్టుబడి ఒక్క రూపాయి వచ్చే పరిస్థితి లేక రైతులు తీవ్ర బాధలో ఉన్నారనీ అన్నారు. గౌరవ జిల్లా కలెక్టర్ గారు, వ్యవసాయ శాఖ సిబ్బంది దయచేసి క్షేత్ర స్థాయిలో పరిశీలించి రైతులకు న్యాయం జరిగేలా చూడాలనీ, పంట నష్టం సాధ్యమైనంత తొందర రైతుల ఖాతాల్లో జమ చేయాలనీ డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో దాదాపు అన్ని గ్రామాల్లో వరి రైతులు నష్టపోయారు. ముఖ్యంగా కామారెడ్డి మండలం క్యసం పల్లి, తిమ్మకపల్లి, చిన్నమల్లారెడ్డి, కోటాల్ పల్లి, లింగయ పల్లి, నర్సన్న పల్లి, గ్రామాలు, రాజంపేట మండల కేంద్రంలో పాటు పొందుర్థి, అహి గ్రామాలు, భిక్నుర్ మండలంలో జంగంపల్లి, దోమకొండ మండల కేంద్రం తో పాటు లింగుపల్లి, చినమాన్ పల్లి, అంబారిపెట్, ముత్యంపేట గ్రామాల్లో, బిబిపేట మండలంలో దాదాపు అన్ని గ్రామంలో చాలా వరకు రైతుల పొలాలు వంద శాతం నష్టపోయారనీ అన్నారు. దాదాపు 10 వేళ ఏకరాల్లో పూర్తి పంట నష్టం జరిగిందనీ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఫసల్ బీమా యోజన అమలు చేసి ఉంటే ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు ఎంతో ఉపయోగ పడేదనీ అన్నారు. 

వడ్ల కొనుగోలు కేంద్రాల్లో కూడా తేమ పేరిట, పోల్లు పేరిట ఒక్క కిలో కూడా కట్ చెయ్యొద్దు రైతులను ఇబ్బంది పెట్టొద్దనీ విజ్ఞప్తి చేశారు.
సాధ్యమైనంత తొందరగా కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలనీ డిమాండ్ చేశారు