Delhi excise case ‘హస్తిన’లో గరం గరం

Delhi excise case ‘హస్తిన’లో గరం గరం
MLC Kavitha
  • ఐదు గంటలుగా ఎమ్మెల్సీ కవిత విచారణ
  • ఫోన్ల ధ్వంసం, డబ్బుపై ఆరా
  • కవితను అరెస్టు చేస్తే ఆందోళనకు సిద్ధంగా ఉన్న బీఆర్​ఎస్​శ్రేణులు

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా జరిగిన లిక్కర్ స్కామ్ కేసులో నోటీసులు అందుకున్న శాసనమండలి సభ్యురాలు, కవిత శనివారం ఉదయం 11 గంటలకు ఢిల్లీలోని ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈఢీ) కార్యాలయానికి హాజరయ్యారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో గుమిగూడే అవకాశం ఉండటంతో పోలీసులు ఈడీ కార్యాలయం పరిసరాల్లో 144 సెక్షన్ విధించారు. మీడియాను కూడా అనుమతించలేదు. శనివారం ఉదయం చేరుకున్న ఆమెను సుమారు ఐదుగంటలుగా విచారిస్తున్నారు. రణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో జాయింట్ డైరెక్టర్ సహా ఆరుగురు సభ్యులతో కూడిన టీమ్ ఎంఎల్‌సీ కవితను విచారిస్తున్నట్లు తెలుస్తుంది.

విచారణలో భాగంగా తొలి గంటలోనే ప్రశ్నలను సంధించారు. రూ. వంద కోట్ల హవాలా డబ్బుపై ప్రధానంగా ఆరా తీస్తున్నారు. ఐటీసీ కోహినూర్‌ డీల్ తర్వాత హవాలాలో ఎన్నికోట్లు చేతులు మారాయి..? ఢిల్లీలోని బెంగాలీ మార్కెట్‌లో హవాలాకు సహకరించింది ఎవరు..? అని కవితను ఈడీ ఆధికారులు ప్రశ్నలడిగే అవకాశం ఉంది. ఇంకా అంతకముందు ధ్వంసం చేసిన ఫోన్ల నుంచి డేటా రికవరీ చేసి కవిత ముందు ఉంచినట్లు సమాచారం. దీనిపై ఎమ్మెల్సీ కవిత స్పందించారా? లేదా? అనేది తెలియరాలేదు. మరోవైపు కవిత అరెస్టు గనుక జరిగితే ఢిల్లీలో పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసలు, ధర్నాలు చేపట్టేందుకు ఇప్పటికే బీఆర్​ఎస్​రెడీ అయినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో గులాబీ వర్గాలన్నీ హస్తినలో ఉన్నాయి.  మొత్తానికి ఎమ్మెల్సీ కవిత, అధికారులకు ఏం చెప్పారు? ఏ మేరకు వారికి వివరాలు లభించాయి? లాంటి విషయాలు పక్కాగా ఇంకా తెలియాల్సి ఉంది.