పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు

పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు

ముద్ర ప్రతినిధి, నిర్మల్:రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం నుంచి దసరా సెలవులు ప్రారంభం కానుండగా జిల్లా వ్యాప్తంగా పలు పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఇందులో భాగంగా తొమ్మిది రోజుల బతుకమ్మలను పేర్చి బతుకమ్మలు ఆడారు. పలు ప్రభుత్వ పాఠశాలలతో పాటు జెవిఎన్ఆర్ తదితర పలు ప్రైవేటు పాఠశాలల్లో సైతం వేడుకలు నిర్వహించారు.  అనంతరం నీటిలో నిమజ్జనం చేశారు.