తెలంగాణ ప్రజల ఇంటి పార్టీ బిఆర్ఎస్

తెలంగాణ ప్రజల ఇంటి పార్టీ బిఆర్ఎస్
  • ప్రజలందరూ సమానంగా ఎదగాలని  కేసీఅర్ ప్రభుత్వం పథకాలు అమలు
  • విద్యా మంత్రి సబితా ఇంద్రారెడ్డి

ముద్ర ప్రతినిధి, రంగారెడ్డి:- తెలంగాణ ప్రజల ఇంటి పార్టీ బిఆర్ఎస్.....ప్రజల గుండె చప్పుడు తెలిసిన మహానేత కేసీఆర్ అని విద్యాశాఖ మంత్రి, మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గం బీఆర్‌ఎస్ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.మాది పేద,మధ్యతరగతి ప్రజల ప్రగతి  ప్రభుత్వం అని పేర్కొన్నారు.గురువారం జల్పల్లి మున్సిపాలిటీ జల్పల్లి గ్రామము  శ్రీరామ కాలనీకి చెందిన వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు మహేశ్వరం బిఆర్ఎస్ అభ్యర్థి,విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో  బిఆర్ఎస్ లో చేరారు. జల్ పల్లి మున్సిపాలిటీ ఉపాధ్యక్షులు శ్రీ దూడల శ్రీనివాస్ గౌడ్ గారి  ఆధ్వర్యంలో సబితమ్మ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు.

ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతు

సామాన్యులకు అండగా ఆసరా  పెన్షన్లు, వృద్ధుల పెన్షన్లు 200 నుండి 2016 కు పెంచమని మంత్రి తెలిపారు.పేదల వంట భారం తగ్గించేందుకే రూ.400 కే సిలిండర్, ప్రతి కుటుంబానికి ధీమా . కేసీఆర్ రూ.5 లక్షల భీమా.93 లక్షల మందికి లబ్ది పొందారని తేలిపారు.సామాన్యుల అభ్యున్నతి లక్ష్యంగా,ప్రజలందరూ సమానంగా ఎదగాలని  కేసీఅర్ ప్రభుత్వం పథకాలు అమలు చేస్తుందని తేలిపారు.మీ కోసం మీలో ఒకరిగా,ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి బాధ్యతతో పనిచేస్తా.....ఆశీర్వదించి మహేశ్వరం ఎమ్మెల్యేగా మరొక్కమారు గెలిపించండని మంత్రి కొరారు.ఈ కార్యక్రమంలో జల్పల్లి  మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు సూరెడ్డి కృష్ణారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ యంజాల జనార్ధన్, యూత్ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ యంజాల అర్జున్, సీనియర్ నాయకులు సూరెడ్డి గోపాల్ రెడ్డి, ఎండి సాదిక్  తదితరులు పాల్గొన్నారు.