కెసిఆర్ దిష్టి బొమ్మ దగ్ధం 

కెసిఆర్ దిష్టి బొమ్మ దగ్ధం 

ముద్ర, లక్షేట్టిపేట :బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అక్రమ అరెస్ట్ ను నీరసిస్తూ గురువారం అంబేద్కర్ చౌరస్తా వద్ద కేసీఆర్ దిష్టి బొమ్మను బిజెపి నాయకులు దగ్ధం చేసారు. ఈ సందర్బంగా బిజెపి పట్టణాధ్యక్షుడు వీరమళ్ళ హరిగోపాల్ మాట్లాడుతూ.. బీజేపీ చలో బాటసింగరాం పిలుపు నేపథ్యంలో డబల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణ పరిశీలనకు బయల్దేరిన కేంద్ర మంత్రి,బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే రఘునందన్ రావు లని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో అక్రమంగా అరెస్ట్ చేయడంపై మండిపడ్డారు. కెసిఆర్ మాయమాటలతో ప్రజలను ఇంకెన్నాళ్లు మోసం చేస్తావని ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో కెసిఆర్ నియంత పాలనకు ప్రజలు కచ్చితంగా బుద్ది చెప్పాలన్నారు.  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హయాంలో అవాస్ యోజన పథకం ద్వారా 5లక్షల ఇండ్లు పేద ప్రజలకు అందించిన ఘనత బిజెపి ప్రభుత్వానిది అని గుర్తు చేసారు. అంతకుముందు కెసిఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేసారు. అక్రమంగా అరెస్ట్ చేసిన బిజెపి నాయకులను వెంటనే విడుదల చేయాలనీ డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో స్టేట్ సెల్ కన్వీనర్ వాసు, జిల్లా కోశాధికారి గుండ ప్రభాకర్, జిల్లా కార్యవర్గ సభ్యుడు వేముల మధు, బీసీ మోర్చా అధ్యక్షుడు పాంచాల రమేష్, ఉపాధ్యక్షుడు మోటపలకుల సతీష్, బాణాల రత్నం, గుండ విహార్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.