విద్యుత్ ఉద్యోగులు విధి నిర్వహణలో జాగ్రత్త వహించాలి 

విద్యుత్ ఉద్యోగులు విధి నిర్వహణలో జాగ్రత్త వహించాలి 
  • సూర్యాపేట డిఎస్పి గొల్లూరి రవి కుమార్

ముద్ర ప్రతినిధి సూర్యాపేట:- ప్రభుత్వం 24 గంటల కరెంటు ఇస్తున్నందున విద్యుత్ ఉద్యోగులు అప్రమత్తంగా, జాగ్రత్తగా విధి నిర్వహణలో ఉండాలని, ప్రజలు తెలిపిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూర్యాపేట డిఎస్పి గొల్లూరి రవి కుమార్ అన్నారు.  సూర్యాపేట జిల్లా విద్యుత్ బిసి ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి, నల్గొండ జిల్లా అధ్యక్షులు మారం శ్రీనివాస్, సూర్యాపేట జిల్లా కార్యవర్గం  సూర్యాపేట డిఎస్పి రవికుమార్ ని బుధవారం  మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించిన సందర్భంగా డిఎస్పి మాట్లాడారు.  

కరెంట్ ఉద్యోగులు ప్రాణాలకు తెగించి 24 గంటలు డ్యూటీలో ఉంటూ కరెంటు ఇస్తున్నందున తగు జాగ్రత్తలు పాటిస్తూ వినియోగదారులకు కరెంటు పోతే వెంటనే ప్రాబ్లం సాల్వ్ చేసే విధంగా అందుబాటులో ఉండాలని సూచించారు. ప్రతివారు కూడా సెల్ ఫోన్  వాడటంలో కూడా అప్రమత్తంగా ఉండాలనీ, ఆన్లైన్ మోసాలు చాలా జరుగుతున్నవనీ,వాటికి గురికావద్దని, మోసపూరితమైన కాల్స్ గాని, ఫేస్ బుక్ విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.  యువత గంజాయికి అలవాటు పడద్దని, ఇతర దుర అలవాట్లకు  దూరంగా ఉండాలని ఆకాంక్షించారు. విద్య తోటే ఏదైనా సాధించగలమని, విద్యతోనే మంచి భవిష్యత్తు ఉన్నదని, ప్రతివారు విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలకు చేరుకునే విధంగా విద్యుత్ ఉద్యోగులు తమ తమ పరిధిలో ప్రజలకు తెలియజేపి నిరక్షరాస్యతను పారదోలాలని కోరారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ బిసి ఉద్యోగుల సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు లోడే శ్రీనివాసరావు, సూర్యాపేట డివిజన్ అధ్యక్షుడు వంగర కృష్ణారావు, సూర్యాపేట డివిజన్ కార్యదర్శి మునగాల వెంకటేశ్వర్లు,  డివిజన్ ఉపాధ్యక్షుడు టి.పిచ్చయ్య, బెల్లంకొండ, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ భరత్‌కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ డి.శ్రీనివాసరావు, జిల్లా కోశాధికారి వల్లపు రమేష్  తదితరులు పాల్గొన్నారు.