దేవీ నవరాత్రి వేడుకల్లో ఏలేటి మహేశ్వర్ రెడ్డి

దేవీ నవరాత్రి వేడుకల్లో ఏలేటి మహేశ్వర్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, నిర్మల్:దేవీ నవరాత్రుల ఉత్సవాలలో భాగంగా సోన్ మండలం న్యూ వెల్మల్, కూచన్ పల్లి, సంగంపేట్, బొప్పారం గ్రామాల్లోని దుర్గాదేవి మండపాలను బిజెపి నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్బంగా గ్రామస్థులు, మహిళలు మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. దేవి మండపాల వద్ద  ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సంగంపేట్ గ్రామానికి చెందిన పలువురు ఇతర పార్టీల నాయకులు భీంరావ్, ప్రశాంత్, అరుణ్, శ్రీనివాస్, రాజాగౌడ్, ప్రశాంత్, వేణు, అన్వేష్,మనోజ్ తో పాటు పలువురు నాయకులు కార్యకర్తలు యువకులు భారతీయ జనతా పార్టీ లో చేరారు. ఈ సందర్బంగా మహేశ్వర్ రెడ్డి  వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.  ఈ కార్యక్రమంలో నాయకులు రావుల రాంనాథ్, సామ రాజేశ్వర్ రెడ్డి, అయ్యన్న గారి రాజేందర్, సరికెల గంగన్న, మార గంగారెడ్డి, హరీష్ రెడ్డి, సాగర్, అశోక్, నాగయ్య, రాజేశ్వర్, నరేష్, సాయినాథ్, సాయన్న, భూమరెడ్డి, గంగారెడ్డి, భీమన్న, నర్సయ్య, సాయన్న, ప్రశాంత్, ప్రవీణ్, గంగయ్యతో పాటు పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.