ఉపాధి పనులు వేగవంతం చేయాలి

ఉపాధి పనులు వేగవంతం చేయాలి
  •  ఎన్ఆర్ఈజిఎస్ పనులపై సమీక్ష సమావేశం
  •  నియోజకవర్గంలో 29 క్రీడా ప్రాంగణాలు పూర్తి.
  • ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి.

హుజూర్ నగర్, ముద్ర: ఉపాధి పనులు వేగవంతం చేయాలని శాసనసభ్యులు  శానంపూడి సైదిరెడ్డి కోరారు.  హుజూర్నగర్ లోని క్యాంపు కార్యాలయంలో సోమవారం హుజూర్నగర్ నియోజకవర్గ ఎన్ఆర్ఈజీఎస్ శాఖకు సంబంధించిన అధికారులతో సమీక్ష, సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ఉపాధిహామీ అధికారులు మండల ల వారిగా తము అమలు చేస్తున్న కార్యక్రమ వివరాలను తెలియజేసారు. నియోజక వర్గంలో ఇరిగేషన్ ప్లానిటేషన్ త్వరలోనే చేయబోతున్నామని దీనికి గాను సర్వే పూర్తి చేశామని త్వరలోనే 14 లక్షలతొంబై మూడు మొక్కల ప్లానిటేషన్ పని ప్రారంభం అవుతుందని తెలియజేసారు. మరియు నియోజక వర్గం లో 29 క్రీడ ప్రాంగణాలు పూర్తి అయినవి వివరించారు. పల్లె ప్రకృతి కేంద్రం లు,సెగ్రిగేషన్ షేడ్స్,పూర్తిస్థాయిలో కంప్లీట్ చేశామని తెలియజేసారు.


ఈ సందర్భంగా  శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ గ్రామాలలోని అందరూ జాబ్ కార్డ్ హోల్డర్స్ కి పని దినాలను కల్పించాలని, శాఖ పరమైన లక్ష్యాలను పూర్తి చేయడంలో ఉద్యోగస్తులు నిబద్ధత భావంతో అంకితభావంతో కృషి చేయాలని ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్  గ్రామ అభివృద్ధికి మొదటి ప్రాధాన్యతను ఇస్తున్నారని తద్వారా గ్రామాలన్నీ కూడా స్వశక్తితో వికాసం చెందాలని దానికి ఎన్ఆర్ఈజీఎస్ శాఖ తోడ్పాటును అందిస్తూ ప్రజలకు ఉపాధి హామీ శాఖద్వారా ఎక్కువ పనిదినాలు కల్పిస్తూ ప్రభుత్వంలో క్రియాశీలకంగా అభివృద్ధిలో భాగస్వామ్యంలో పాలు పంచుకోవాలని  శాసనసభ్యులు శ్రీ శానంపూడి సైదిరెడ్డి  తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హుజుర్నగర్ నియోజక  వర్గం లోని ఏపీఓలు శైలజ జ్యోతి సురేష్ శేఖర్ రాజు ఉమా పాల్గొన్నారు.