ప్రజాదరణ చూసి ఓర్వలేకనే  అసత్యపు ప్రచారం  చేస్తున్నారు...    

ప్రజాదరణ చూసి ఓర్వలేకనే  అసత్యపు ప్రచారం  చేస్తున్నారు...    
  • ఎండపల్లి మాజీ సర్పంచ్ జలంధర్ రెడ్డి           

వెల్గటూర్, ముద్ర : ఎండపల్లి గ్రామంలో తనకు ఉన్న ప్రజాదరణను చూసి ఓర్వలేక ఎండపల్లి ఎంపీటీసీ ఎండి బషీర్ తనకు అవినీతిని అంటగట్టి, అసత్యపు ప్రచారం చేస్తున్నారని ఆగ్రామ మాజీ సర్పంచ్ మారం జలంధర్ రెడ్డి అన్నారు. శుక్రవారం గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట నాయకులతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. కాగా అంతకుముందు ఎండపల్లి  ఎంపిటిసి ఎండి బషీర్, మాజీ సర్పంచ్  గంగాధర్ లు విలేకరుల  సమావేశం నిర్వహించి.  సర్పంచ్ జలంధర్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ నిధులు దూర్వినియోగమయ్యాయని ఆరోపణలు చేశారు. ఈ మేరకు జలంధర్ రెడ్డి వారు చేసిన ఆరోపణలకు వివరణ ఇస్తూ  ఎండపల్లి  గ్రామానికి తను పదవిలో ఉన్న సమయంలో వచ్చిన నిధులు, చేసిన ఖర్చుల గురించి వివరించారు. ఎండపల్లి గ్రామానికి ఐదు సంవత్సరాల కాలంలో రూ.2.51 కోట్ల నిధులు వచ్చాయని తెలిపారు.  అందులో విద్యుత్ బిల్లులకు రూ.12 లక్షలు ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. గ్రామ గ్రామపంచాయతీ.

సిబ్బందికి, ఈ పంచాయతీ ఆపరేటర్, సర్పంచ్ జీతాలు  50 లక్షల వరకు చెల్లించామని తెలిపారు. గ్రామపంచాయతీకి ప్రభుత్వం కేటాయించిన ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్ ల కొనుగోలు కోసం రూ. 10 లక్షలు ఖర్చు చేసినట్లు వివరించారు, మిగిలిన డబ్బులతో వివిధ రకాల అభివృద్ధి పనులు నూతన పైప్ లైన్, సిసి రోడ్లు, పల్లె ప్రకృతి వనం ఫెన్సింగ్ మరియు చదును, చేతి పంపులు , రిపేర్లు పైప్ లైన్ రిపేర్లు, బ్లీచింగ్ పౌడర్, ట్రీ గార్డ్స్, ఓపెన్ వెల్ మోటర్, డిసిల్టింగ్, గ్రావెలింగ్, కంప్యూటర్ కొనుగోలు, ఫాగింగ్ మిషన్ కొనుగోలు, హైపోక్లోరైడ్ స్ప్రేయింగ్, పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా బ్లేడ్ ట్రాక్టర్, జెసిపి, అదనపు లేబర్ ల వినియోగం తోపాటు ఇతర ఖర్చులకు వినియోగించిన్నట్లు  వివరించారు .

గ్రామం లో తనకు  ఉన్న ప్రజా దరణ, పలుకుబడిని చూసి ఓర్వలేక, భవిష్యత్తులో రాజకీయంగా ఇక్కడ వారికి స్థానం లేదని గ్రహించి లేనిపోని నిందలు వేసి నన్ను బదనం చేయాలని చూస్తున్నారని అన్నారు. గ్రామపంచాయతీలో నిజంగా అవకతవకలు జరిగినట్లయితే సంబంధిత అడికారులైన ఎంపీడీవో , డిపిఓ ,డిఎల్పిఓ , కలెక్ట ర్ తో విచారణ జరిపించాలని తెలిపారు. తాను అవినీతి చేసినట్లు నిరూపిస్తే వారు ఎటువంటి శిక్ష విధించిన దానికి సిద్ధమేనని అన్నారు.కానీ ఇలాంటి చవక బారు విమర్శలు చేసి ప్రజలలో లబ్ధి పొందాలని చూస్తే మాత్రం సహించేది లేదని తెలిపారు.