పర్యావరణ పరిరక్షణ  అందరి బాధ్యత - మునిసిపల్ చైర్మన్ జి ఈశ్వర్

పర్యావరణ పరిరక్షణ  అందరి బాధ్యత -  మునిసిపల్ చైర్మన్ జి ఈశ్వర్

ముద్ర ప్రతినిధి, నిర్మల్: పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని, ఇందుకోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ అన్నారు. సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ ,  ఈశ్రీ గ్రీన్ వర్క్ సంస్థల ఆధ్వర్యంలో ప్లాస్టిక్ వాడకాలపై జరిగే అనర్థాలపై పురపాలక సంఘ కార్యాలయంలో ఢిల్లి నుండి విచ్చేసిన విద్యార్థులతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్లాస్టిక్ తో పర్యావరణానికి పెనుముప్పు ఉందని అన్నారు. ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వాడకం తగ్గించాలని కోరారు. పట్టణంలోని కమర్షియల్ షాపింగ్ మాల్స్, వ్యాపారస్తులు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి, దారంతో నేసిన సంచి వంటివి ఉపయోగించాలని కోరారు.గత ఐదు రోజులగా జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడళ్ళలో ప్లాస్టిక్ వాడకం వల్ల జరిగే అనర్థాల గూర్చి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అన్నారు.కమిషనర్ సివిఎన్ రాజు, టిపిఎస్ నవీన్, టిపిఓ సుమలత, సానిటరీ ఇన్స్పెక్టర్ దేవిదాస్, కౌన్సిలర్లు, తదితరులు ఉన్నారు.