కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జూపల్లి ని గెలిపించాలని ఇంటింటా ప్రచారం

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జూపల్లి ని గెలిపించాలని ఇంటింటా ప్రచారం
  • మండల రైతు బంధు సమితి మాజీ అధ్యక్షుడు ఏత్తం కృష్ణయ్య

ముద్ర/వీపనగండ్ల:-ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియమ్మ రుణాన్ని తీర్చుకోవాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని మండల రైతు బంధు సమితి మాజీ అధ్యక్షుడు ఏత్తం కృష్ణయ్య అన్నారు. మాజీమంత్రి కొల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు ను గెలిపించాలని కోరుతూ సోమవారం మండల కేంద్రమైన వీపనగండ్లలో ఎత్తం కృష్ణయ్య ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే పేదలకు ఇందిరమ్మ ఇండ్లు వచ్చాయని,రైతులకు ఉచిత విద్యుత్తు కాంగ్రెస్ పుణ్యమే అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ లు మహాలక్ష్మి పథకంతో మహిళలకు ప్రతినెల 2500 రూపాయలు,500 కే గ్యాస్ సిలిండర్,ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉంటుందని, రైతు భరోసా పథకం కింద రైతులకు కౌలు రైతులకు ఎకరానికి 15000 రూపాయలు,వ్యవసాయ కూలీలకు వరి పంటకు 500 బోనస్ ఇస్తామని, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇల్లు,యువ వికాసం చేయుత పథకాలను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అందిస్తుందని వివరించారు, కార్యక్రమంలో కార్యకర్తలు భారత్ రెడ్డి,అశోక్,సాయీ,శేఖర్,నరసింహ,తులసి తదితరులు ఉన్నారు.