ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే పౌష్టిక ఆహారం తీసుకోవాలి 

ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే పౌష్టిక ఆహారం తీసుకోవాలి 


గుండాల మార్చి 22 (ముద్ర న్యూస్): ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే పౌష్టిక ఆహారం తీసుకోవాలని మోత్కూర్ ఐసిడిఎస్ సిడిపిఓ జోష్ణ అన్నారు శుక్రవారం బ్రాహ్మణపల్లి గ్రామంలో పోషణ పక్వాడలో  భాగంగా ప్రపంచ జల దినోత్సవాన్ని పురస్కరించుకొని,జరిగిన ఈ కార్యక్రమంలో కాలుష్యాన్ని నివారించేందుకు మనం వాడే నూనె పదార్థాలను  రసాయనాలను ఔషధాలను చెరువులలో కుంటలలో పారే నీటిలో బావులలో భూగర్భంలో కలవకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు.ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతలు తీసుకొని ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు బయటికి వెళ్తే ఎండలు మండిపోతున్నాయి మీ ఆరోగ్యం కాపాడు కాపాడుకోవడానికి త్రాగునీరు పండ్ల రసాలు ద్వారా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అన్నారు చిన్నారులకు గర్భిణీ స్త్రీలకు తల్లి పిల్లలకు కిషోర్ బాలికలకు గ్రామస్తులకు ఆరోగ్యాన్ని సంరక్షించుకునే  విధంగా అన్ని రకాల సూచనలు ఇచ్చారు.ఈ కార్యక్రమంలో,ఐసిడిఎస్ సూపర్వైజర్ యాకూబ్ పాషా బేగం ప్రధానోపాధ్యాయులు వెంకన్న ఏ డబ్ల్యూ టి సి హెచ్ మౌనిక ఆశ వెంకటమ్మ తదితరులు పాల్గొన్నా