Former Jharkhand CM Hemant Soren arrest: ఝార్ఖండ్‌ మాజీ సీఎం హేమంత్‌ సోరెన్‌ అరెస్టు

Former Jharkhand CM Hemant Soren arrest: ఝార్ఖండ్‌ మాజీ సీఎం హేమంత్‌ సోరెన్‌ అరెస్టు

రాంచీ: ఝార్ఖండ్‌ ముక్తిమోర్చ (JMM) కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ సీఎం హేమంత్‌ సోరెన్‌ ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో దాదాపు ఆరు గంటలకు పైగా విచారణ అనంతరం ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం హేమంత్‌ను రాంచీలోని ఈడీ కార్యాలయానికి తరలించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. హేమంత్‌ సోరెన్‌ ఈడీ అధికారుల అదుపులోనే ఉన్నట్లు రాజ్యసభ ఎంపీ మహువా మాజీ ధ్రువీకరించారు. మరోవైపు, హేమంత్‌ సోరెన్‌ సీఎం పదవికి రాజీనామా చేయగా.. దాన్ని గవర్నర్‌ ఆమోదించినట్లు రాజ్‌భవన్‌ వెల్లడించింది.