అధికార మదంతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆటవికంగా ప్రవర్తిస్తుండు

అధికార మదంతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆటవికంగా ప్రవర్తిస్తుండు
  • భోనగిరి జడ్ పి చైర్మన్ సందీప్ రెడ్డి పై జరిగిన దాడి ఆయన ఆటవిక ప్రవర్తనకు తార్కాణము 
  • రక్షించాల్సిన పోలీసులు సందీప్ రెడ్డిని నెట్టేయ్యడం దారుణం
  • అత్యుత్సాహం ప్రదర్శించిన రాచకొండ పోలీసులపై డిజిపి చర్యలు తీసుకోవాలి
  • మంత్రి హోదాలో ఇంతటి ఆటవికంగా ప్రవర్తించండం దుర్మార్గపు చర్య
  • అంతటి అహంకారం ప్రజాక్షేత్రంలో పనికి రాదు
  • మంత్రి హోదాలో బుద్దిగా ఉంటారని జిల్లా ప్రజలు ఆశించారు
  • జిల్లా ప్రజలు చైతన్యంతో ఆలోచన చేస్తారు
  • ఆయన చేసిన దీక్ష తెలంగాణా కోసం కాదు
    కిరణ్ కుమార్ రెడ్డి తొలగిస్తారనే పడవికీ రాజీనామా
  • ఊడి పోయే పదవికి త్యాగాల ట్యాగ్ వేసుకుని ఊరేగుతుండు
  • తెలంగాణా ఉద్యమ సమయంలో వైఎస్ బూట్లు నాకిండు
  • రెవంత్ రెడ్డి బెడ్ రూమ్ లో కాళ్ళు పట్టుకుని మంత్రి పదవి తెచ్చుకున్నారు 
  • కెసిఆర్,కేటీఆర్ ల గురుంచి మాట్లాడే నైతికత ఆయనకు లేదు
  • దివంగత మంత్రి మాధవరెడ్డి అనుచరులకు సిగరెట్లు మోసి బతికిన చరిత్ర ఆయనది
  • 20 ఏండ్ల పాలనలో జిల్లాకు ఆయన ఓరగా పెట్టింది ఏమి లేదు
  • హామీల అమలుకు ప్రజలు నిలదిస్తుంటే అసహనం తోటే విపక్షాల మీద దాడులు
  • చెప్పుతో కొట్టండి అన్న నోరే చేతులతో నెట్టేదాకా చేరింది
  • వ్యక్తిగతంగా మాట్లాడితే జిల్లాలో తిరగ లేవు
  • నీ చరిత్ర చాలా ఉంది
  • సందర్భానుసారాంగ బయట పెడతాం
  •  కోమటిరెడ్డి పై మాజీమంత్రి జగదీష్ రెడ్డి మండిపాటు


ముద్ర ప్రతినిధి సూర్యాపేట:-మంత్రి హోదాలో ఉండి ఆటవికంగా ప్రవర్తించడం కోమటిరెడ్డి కే చెల్లిందని మాజీ మంత్రి,సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఎద్దేవాచేశారు. భోనగిరి జడ్ పి చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి పై జరిగిన దాడియే ఆయన ఆటవిక ప్రవర్తనకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. భోనగిరి నియోజకవర్గ పరిధిలో జరిగిన అధికారిక పర్యటనలో పాల్గొన్న జడ్ పి చైర్మన్ పై జరిగిన దాడిని జగదీష్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం సూర్యాపేట జిల్లా కేంద్రంలో మాజీ శాసనసభ్యులు గాధరి కిశోర్ కుమార్, రాష్ట్ర బి ఆర్ యస్ కార్యదర్శి వై వెంకటేశ్వర్లతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.ఆటవికంగా దాడి జరుగుతున్న ప్పుడు రక్షించాల్సిన పోలీసులే జడ్ పి చైర్మన్ హోదాలో ఉన్న సందీప్ రెడ్డిని నెట్టి వేయడం దురదృష్టకరమన్నారు.

అత్యుత్సాహం ప్రదర్శించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిజిపి ని డిమాండ్ చేశారు.మంత్రి హోదాలో ఉన్న కోమటిరెడ్డి సత్ప్రవర్తన తో ఉంటారనుకుంటే అందుకు భిన్నంగా ఆటవికంగా ప్రవర్తిస్తున్నారని ఆయన విమర్శించారు. అంతటి అహంకారం ఎప్పటికీ ఆరోగ్యకరం కాదని ఆయన హితవు పలికారు.చైతన్యాన్ని పుణికి పుచ్చుకున్న ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలు తలకెక్కిన అహంకారాన్ని కిందకు దించుతారని ఆయన పేర్కొన్నారు. కోమటిరెడ్డి చేసిన దీక్ష తెలంగాణా కోసం ఎంత మాత్రం కానే కాదని ఆయన తేల్చిచెప్పారు.నాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి ని ఖచ్చితంగా మంత్రి పదవి నుండి తొలగిస్తారని తెలుసుకునే దీక్ష జపం మొదలుపెట్టారని ఆయన ఆరోపించారు. ఊడి పోయే పదవీకి రాజీనామా చేసి తెలంగాణా కోసం రాజీనామా అన్నట్లు నమ్మ పలికే విదంగా త్యాగాల ట్యాగ్ ను పదేళ్ల నుండి మెడకేసుకుని తిరుగుతున్నాడని జగదీష్ రెడ్డి ఎద్దేవాచేశారు. వాస్తవానికి తెలంగాణా ఉద్యమ సమయంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ బూట్లు నాకుతూ పదవులు కాపాడుకునేందుకు ప్రసన్నం చేసుకున్న చరిత్ర కోమటిరెడ్డి దని ఆయన ఘాటుగా విమర్శించారు. అంతెందుకు తాజాగా వచ్చిన మంత్రి పదవి కుడా రేవంత్ రెడ్డి బెడ్ రూమ్ లోకి పోయి కాళ్ళ మీద పడితేనే వచ్చిందని ఆయన పేర్కొన్నారు.గులాబీ బాస్ మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల గురుంచి మాట్లాడే నైతికత కోమటిరెడ్డి కి లేదన్నారు. దివంగత మంత్రి మాధవరెడ్డి అనుచరులకు సిగరెట్లు మోసిన చరిత్ర కోమటిరెడ్డి దన్నారు.20 ఏండ్లుగా అధికారం లో ఉన్న కోమటిరెడ్డి జిల్లాకు ఓరగపెట్టింది ఏమి లేదన్నారు హామీల అమలుకు ప్రజలు నిలదిస్తుంటేనే అసహనంతో కోమటిరెడ్డి ఆటవికంగా ప్రవర్తిస్తున్నాడని ఆయన దుయ్యబట్టారు.రైతు బంధు అడిగితే చెప్పులతో కొట్టండి అన్న నోరే అధికార పక్షాన్ని నిలదీస్తే తట్టుకోలేక విపక్ష ప్రజాప్రతినిధులను నెట్టండి అంటూ పోలీసులను పురమాయించే దాకా వెళ్లింది అంటే కాంగ్రేస్ పాలన ఎటుపోతుందో అన్నది ఇట్టే తెలిసి పోతుందని ఆయన వ్యంగగా విమర్శలు సంధించారు.