పదవ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్, పెన్నులు అందజేత...

పదవ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్, పెన్నులు అందజేత...

ముద్ర, మల్యాల: చొప్పదండి నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలతో ముందుకు వెళుతున్న కార్పొరేటర్, ఆధార్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు కంసాల శ్రీనివాస్ మండల పరిధిలోని పలు ప్రభుత్వ జిల్లా పరిషత్ స్కూల్స్, మోడల్ స్కూల్లో విద్యార్థిని విద్యార్థులు 332 మందికి 30వేల విలువ గల ఎగ్జామ్ ప్యాడ్స్, పెన్నులు అందజేశారు. ఈ సందర్బంగా స్టూడెంట్స్ అందరికి 
బెస్ట్ ఆఫ్ లక్ చెప్పారు.

అనంతరం మాట్లాడుతూ... ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఆత్మస్థైర్యంతో ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయాలని, మంచి మార్కులతో విజయాలు అందుకోవాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను, గురుకులాలను సీఎం కెసిఆర్ తీర్చిదిద్దారన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

 పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో...
మల్యాలలోని శ్రీ మార్కండేయ ఆలయ ఆవరణలో బుధవారం స్థానిక పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో 130 మంది పదవ తరగతి విద్యార్థులకు ప్యాడ్స్, పెన్నులు పంపిణి చేశారు. సింగపూర్ లో వర్క్ చేస్తున్న మల్యాలకు చెందిన బోట్ల రమేష్ సహకారంతో అందజేసినట్లు పద్మశాలి సంఘం అధ్యక్షులు బోడ గోవర్ధన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మిట్టపల్లి సుదర్శన్, తదితరులు పాల్గొన్నారు.