పార్లమెంట్ ఎన్నికల కోడ్ సమీపిస్తున్న వేళ తుంగతుర్తి నియోజకవర్గం లోని వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ల నియామకం వేగవంతం

పార్లమెంట్ ఎన్నికల కోడ్ సమీపిస్తున్న వేళ తుంగతుర్తి నియోజకవర్గం లోని వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ల నియామకం వేగవంతం
  • తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గా పాలకుర్తి రామ తార రాజయ్య?
  • తుంగతుర్తి మార్కెట్ చైర్మన్ పదవి కోసం పోటీ పడుతున్న అనురాధ కిషన్ రావు, రేటినేని , గిరిధర్ రెడ్డిలు
  • మార్కెట్ చైర్మన్ ల ఖరారుపై పూటకో పేరు షికారు చేస్తున్న వైనం
  • రెండు మూడు రోజుల్లో మార్కెట్ చైర్మన్ ఎవరు ప్రకటించే అవకాశం?

తుంగతుర్తి ముద్ర:- పార్లమెంట్ ఎన్నికల కోడ్ సమీపిస్తున్న నేపథ్యంలో తుంగతుర్తి నియోజకవర్గం లోని ప్రతిష్టాత్మక వ్యవసాయ మార్కెట్ చైర్మన్ల నియామక ప్రక్రియ వేగవంతంగా సాగుతున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగా తిరుమలగిరి ,తుంగతుర్తి వ్యవసాయ మార్కెట్ల చైర్మన్ల పేర్ల ఖరారుపై కసరత్తు సాగుతున్నట్టు తెలుస్తోంది. నియోజకవర్గంలో మొత్తం నాలుగు మార్కెట్ కమిటీలు ఉండగా వాటిలో అత్యంత  ప్రాధాన్యత కలిగిన తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా తిరుమలగిరి మండలం గుండెపురి గ్రామానికి చెందిన పాలకుర్తి రామతార రాజయ్య పేరు ఎంపిక అవుతున్నట్లు సమాచారం .పాలకుర్తి రామతార భర్త రాజయ్య గత 50 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఒకసారి సర్పంచ్గా మరోసారి జెడ్పిటిసి గా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా సుదీర్ఘకాలం పార్టీలో పని చేస్తూ దామోదర్ రెడ్డి ప్రధాన అనుచరులలో ప్రధముడు గా కొన సాగుతున్నారు .

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో పటిష్టమైన నాయకుడిగా పేరు ఉన్న రాజయ్య సతీమణి రామ తార పేరును మార్కెట్ చైర్మన్ గా సూచించినట్టు సమాచారం. అలాగే తుంగతుర్తి వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గా పదవిని ఆశిస్తున్న వారిలో మండల పరిధిలోని కొత్తగూడెం గ్రామానికి చెందిన ప్రస్తుత జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తిరుమల ప్రగడ అనురాధ కిషన్ రావు పేరు ప్రముఖంగా వినవస్తోంది అనాదిగా కాంగ్రెస్ పార్టీకి చెందిన కుటుంబాన్ని నుంచి వచ్చిన వారు కావడం తుంగతుర్తి నియోజకవర్గంలో మాజీ మంత్రి దామోదర్ రెడ్డి రాజకీయం ప్రారంభించిన నాటి నుండి నేటి వరకు ఆయన అనుచరులుగానే కొనసాగుతూ ఉన్న నేపథ్యంలో గతంలో ఒకసారి ఎంపీపీగా ప్రస్తుతం జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా కొనసాగుతున్నారు .సీనియార్టీని దృష్టిలో ఉంచుకుని పార్టీకి చేసిన సేవలను దృష్టిలో ఉంచుకుని ఈసారి తుంగతుర్తి మార్కెట్ చైర్మన్ గా అనురాధ కిషన్ రావుల పేర్లను ప్రకటించవచ్చని మాట వినవస్తోంది .అలాగే గుమ్మడవెల్లి గ్రామానికి చెందిన  శ్రీనివాసరావు నూతనకల్ మండలానికి చెందిన గిరిధర్ రెడ్డి ల పేర్లు ప్రముఖంగా వినవస్తున్నాయి.

వీరిలో మాజీ మంత్రి దామోదర్ రెడ్డి ఎవరి వైపు మొగ్గు చూపుతారు వేచి చూడాల్సిందే. ఏది ఏమైనా ఎన్నికల కోడ్ వచ్చేలోగా మార్కెట్ చైర్మన్ ల నియామకం పూర్తిచేసే అవకాశం ఉందని కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నాయి .మరి మార్కెట్ చైర్మన్ ల పేర్లు అధికారికంగా ప్రకటించేదాకా ద్వితీయ శ్రేణి నాయకుల పైరవీలు కొనసాగుతూనే ఉంటాయి. కొంతమంది నాయకులు మాజీ మంత్రి దామోదర్ రెడ్డిని నమ్ముకోగా, మరి కొంతమంది జిల్లా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వద్ద తమ పేర్ల ఖరారు  పై పైరవీలు చేస్తున్నట్లు సమాచారం .ఎవరి ప్రచారాలు ఎలా ఉన్నా తుంగతుర్తి శాసనసభ్యుడు మందుల సామెల్ అధికారికంగా మార్కెట్ చైర్మన్ ల పేర్లు ఖరారు చేయాల్సి ఉంది .ఏ మార్కెట్ కు ఎవరు చైర్మన్ లో మరో రెండు మూడు రోజుల్లో తేలుతుందని ప్రచారం సాగుతోంది .అప్పటిదాకా ఊహాగానాలు గుప్పుమంటూనే ఉంటాయనేది వాస్తవం.