సూర్యపేట ఎస్పి పేరు మీద ఫేక్ ఫేస్ బుక్ ప్రొఫైల్....

సూర్యపేట ఎస్పి పేరు మీద ఫేక్ ఫేస్ బుక్ ప్రొఫైల్....
  • ఎవ్వరూ స్పందించవద్దు, డబ్బులు పంపవద్దు.

సూర్యాపేట ముద్ర ప్రతినిధి:-ఫేస్ బుక్ నుండి ఎవరైనా నంబర్ అడిగినా, డబ్బులు అడిగినా ఇవ్వవద్దు అని సూర్యాపేట  జిల్లా ఎస్పి రాహుల్ హెగ్డే బుధవారం ఒక  ప్రకటన లో తెలిపారు.ఎస్పీ సూర్యపేట ఫేస్బుక్ ప్రొఫైల్ ను పోలిన రెండు నకిలీ ఫేస్ బుక్ ప్రొఫైల్స్ ను సైబర్ నేరగాళ్లు క్రియేట్ చేసినారన్నారు.వాటి నుండి వచ్చే మెసేజ్ లకు, రిక్వెస్ట్ లకు స్పందించవద్దని, వ్యక్తిగత వివరాలు చెప్పవద్దని, డబ్బులు పంపించవద్దని  జిల్లా ఎస్పి  విజ్ఞప్తి చేశారు. కేసు నమోదు చేసి, ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకుంటాం అని ఎస్పి  అన్నారు.