బేలర్ లో పడి.. తెగిన వ్యక్తి చేయి

బేలర్ లో పడి.. తెగిన వ్యక్తి చేయి

స్టేషన్ ఘన్ పూర్, ముద్ర: బేలర్( గడ్డి కట్టలు చుట్టే యంత్రం)లో పడి గండి వెంకట మల్లు అనే వ్యక్తి ఎడమ చెయ్యిని పోగొట్టుకున్న సంఘటన శనివారం కొత్తపెళ్లి లో జరిగింది. వివరాలు కి వెళితే జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన గండి వెంకట మల్లు ఓ రైతు వ్యవసాయ క్షేత్రంలో గడ్డి కట్టలు చుట్టేందుకు తన బేలర్ తో వెళ్ళాడు. గడి కట్టలు చుట్టేందుకు వ్యవసాయ క్షేత్రంలోకి బేలర్ తో దిగిన వెంకట మల్లు కట్టలు చుట్టేందుకు ఉపయోగించే సుతిలి దారం తెగిపోవడానికి గుర్తించి అది సరి చేసేందుకు కిందకు దిగి సరి చేస్తుండగా ప్రమాదవశాత్తు బేలర్ పై పడిపోవడంతో తన ఎడమ చేయి బేలర్ లో పడి మోచేతి వరకు నుజ్జు నుజ్జజై తెగిపోయింది. స్థానికులు ప్రమాదాన్ని గుర్తించి చికిత్స నిమిత్తం అతన్ని వరంగల్ ఆసుపత్రికి తరలించారు.