ప్రముఖ వైద్యుడు నాగేశ్వరరావు కన్నుమూత

ప్రముఖ వైద్యుడు నాగేశ్వరరావు కన్నుమూత

ముద్ర జూబ్లీహిల్స్: డాక్టర్ ముంగి నాగేశ్వరరావు గచ్చిబౌలి గమన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లో బుధవారం మధ్యాహ్నం మూడున్నర గంటల ప్రాంతంలో తుది శ్వాస విడిచారు. జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరిగాయి. పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ గ్రామంలో జన్మించిన డాక్టర్ ముంగి నాగేశ్వరరావు స్వాతంత్ర్యం మొదలైన టైంలో ప్రాక్టీస్ చేసిన ఆదర్శవంతమైన డాక్టర్ గా పేరు సంపాదించారు.

రూపాయి కన్సల్టెన్సీ ఫీజు లేకుండా వేల మందికి ఉచితంగా వైద్యాన్ని అందించి డాక్టర్లకే డాక్టర్ గా ఖ్యాతిని సంపాదించుకున్నారు .బంధుమిత్రులతోపాటు వందలాది అభిమానుల నడుమ అంతిమయాత్ర కొన సాగింది. డాక్టర్ చేసినటువంటి చిరస్మరణీయ సేవలను పలువురు ప్రముఖులు ఈ సందర్భంగా నెమరు వేసుకుంటూ.. సంతాపాన్ని తెలియజేశారు.