దిలావర్ పూర్ లో రైతుల ఆందోళన 

దిలావర్ పూర్ లో రైతుల ఆందోళన 

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లా దిలావర్ పూర్ మండలం గుండం పల్లి సమీపంలో నిర్మిస్తున్న ఇథనాల్ ఫాక్టరీ ఏర్పాటును విరమించుకోవాలని ఫాక్టరీ ఎదుట రైతులు మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. సంస్థ పి ఆర్ వో నారాయణ రెడ్డితో వాగ్వివాదానికి దిగారు. అనుమతులు చూపించకుండా ఇష్టా రీతిన వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు, పంటలకు, పర్యావరణానికి విఘాతం కలిగించే ఈ ఫ్యాక్టరీ ఏర్పాటును నిలిపివేయాలని డిమాండ్ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండడం తో నర్సాపూర్ జి ఎస్సై యాసిర్ అరాఫత్ నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.