రైతులకు సకాలంలో విత్తనాలు ఎరువులు సరఫరా చేయాలి 

రైతులకు సకాలంలో విత్తనాలు ఎరువులు సరఫరా చేయాలి 

జిల్లా కలెక్టర్ వెంకట్రావు

ముద్ర ప్రతినిధి, సూర్యాపేట:రైతులకు సకాలంలో విత్తనాలు ఎరువులు సరఫరా చేయుటకు తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు తెలిపారు .శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల చట్టాలు అమ్మకాలపై, డీలర్లు, రిటైల్ డీలర్లు, పిఎసిఎస్, ఏఆర్ ఎస్కే లతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొని కలెక్టర్ మాట్లాడుతూ వానకాలం 2023 సీజన్ సూర్యాపేట జిల్లాలోని రైతులకు సకాలంలో విత్తనాలు ఎరువులు సరఫరా చేయుట కొరకు ఎరువుల దుకాణాలలో , పిఎసిఎస్ లలో ఎరువుల లభ్యత, మార్క్ఫెడ్ గోడౌన్ లోఎరువుల నిల్వలు, టేక్ పాయింట్ నుండి జిల్లాకు కేటాయించిన ఎరువుల గురించి కలెక్టర్ సమీక్షించారు.

జిల్లాలో వానాకాలం 20 23 పంటలకు సరిపడా అన్ని విత్తనాలు ఎరువులు పురుగుమందులు అందుబాటులో ఉండే విధంగా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కలెక్టర్ సూచించారు. టాస్క్ఫోర్స్ టీం ద్వారా అన్ని విత్తన, ఎరువులు , పురుగుమందుల దుకాణాలలో తనిఖీ చేయవలసిందిగా కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. రిటైల్ డీలర్లు అందరూ పిఓఎస్ మోషన్ ద్వారానే ఎరువులను విక్రయించవలసిందిగా కలెక్టర్ తెలియజేశారు. లేనియెడల చట్ట ప్రకారం తగు చర్యలు తీసుకోబడతాయని కలెక్టర్ పేర్కొన్నారు. రైతులకు సంబంధించిన ఏ విషయంలోనైనా అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని ,రైతులకు చిన్న ఇబ్బంది జరిగిన  చర్యలు తీసుకోబడతాయని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలో నకిలీ విత్తనాలు ఎరువులు అమ్మిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోబడతాయని  కలెక్టర్ తెలిపారు.

డి.ఎస్.పి నాగభూషణం మాట్లాడుతూ రైతులకు మేలు చేసే విధంగా పనిచేయాలని ,అందరిపై నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని, నకిలీ విత్తనాలు అనేవి లేకుండా చర్యలు తీసుకోవడంలో భాగంగా ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ కమిటీ తనిఖీలు చేపడతాయని ప్రతి ఫర్టిలైజర్ షాపులలో తనిఖీలు చేసి స్టాకు రికార్డులను పరిశీలిస్తామని నకిలీ విత్తనాలు అమ్మేవారిని గుర్తించి వారిపై చట్టపరంగా పీడియాక్ట్ నమోదు చేస్తామని డిఎస్పీ తెలిపారు.       ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి రామారావు నాయక్, డిఎం మార్క్ ఫెడ్  జ్యోతి, డియం ఆగ్రోస్ ,ఎడిఏలు, మండల వ్యవసాయ అధికారులు, ఫెర్టిలైజర్స్ కంపెనీ ప్రతినిధులు, రాష్ట్ర హోల్సేల్ డీలర్లు, జిల్లా హోల్సేల్ డీలర్లు, పిఎసిఎస్, ఏఆర్ స్కేలు, రిటైల్ డీలర్లు సిబ్బంది పాల్గొన్నారు.